కూతురి అన్నప్రాసన వేడుకలో రాకింగ్ రాకేశ్ | Rocking Rakesh At His Daughter Annaprasana Celebration, Photos Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Rocking Rakesh: కూమార్తె తొలి పండగ.. కమెడియన్ రాకేశ్ వీడియో

Jun 22 2025 3:45 PM | Updated on Jun 22 2025 5:35 PM

Rocking Rakesh Daughter Annaprasana Celebration

కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి.. 'జబర్దస్త్' కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న రాకింగ్ రాకేశ్ ప్రస్తుతం పలు సినిమాలు, ఈవెంట్స్ చేసుకుంటున్నాడు. గత కొన్నాళ్లుగా టీవీ కామెడీ షోల్లో ఎక్కడా కనిపించట్లేదు. 2023లో యాంకర్ సుజాతని పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పటికప్పుడు వీళ్లిద్దరూ వీడియోలు పోస్ట్ చేస్తూ వచ్చారు. 8 నెలల క్రితం వీళ్లకు కూతురు పుట్టగా.. ఇప్పుడు ఆ చిన్నారి తొలి పండగని సెలబ్రేట్ చేసుకున్నారు.

(ఇదీ చదవండి: నిహారిక విడాకులు.. తప్పు నాదే!: నాగబాబు)

తన కూతురు ఖ్యాతికకు అన్నప్రాసన జరిగిన విషయాన్ని కాస్త ఆలస్యంగానే రాకేశ్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఫొటోగ్రాఫర్స్ ఆలస్యం వల్ల ఇలా లేటుగా ఫొటోలు పెట్టానని విషయాన్ని యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో చెప్పుకొచ్చాడు. దేవుడికి పూజ చేయడం, అమ్మాయిని చూపించడం లాంటివి చేశారు గానీ పాప ఏం దేన్ని ఒడిసి పట్టుకుందనేది మాత్రం రివీల్ చేయలేదు.

రాకేశ్ భార్య సుజాత విషయానికొస్తే.. న్యూస్ యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. బిగ్‌బాస్ 4వ సీజన్‌లో పాల్గొంది. కాకపోతే ఎక్కువ వారాలు హౌసులో ఉండలేకపోయింది. ప్రస్తుతం ఈమె కూడా ఎక్కడా పనిచేయట్లేదు. పాపని చూసుకుంటోంది. ప్రస్తుతానికైతే ఫ్యామిలీ లైఫ్‌ని రాకేశ్- సుజాత ఎంజాయ్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: బర్త్ డే స్పెషల్.. 'జన నాయగణ్' వీడియో రిలీజ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement