నితిన్‌ రాబిన్‌ హుడ్‌  | ROBINHOOD Movie Title Reveal Glimpse: Nithiin | Sakshi
Sakshi News home page

నితిన్‌ రాబిన్‌ హుడ్‌ 

Jan 27 2024 3:42 AM | Updated on Jan 27 2024 3:42 AM

ROBINHOOD Movie Title Reveal Glimpse: Nithiin - Sakshi

‘భీష్మ’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రానికి ‘రాబిన్‌ హుడ్‌’ టైటిల్‌ ఖరారైంది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించనున్నారట. శుక్రవారం (జనవరి 26) రిపబ్లిక్‌ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

మేకర్స్‌. ‘డబ్బు చాలా చెడ్డది... రూపాయి రూపాయి నువ్వు ఏం చేస్తావ్‌ అంటే... అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ల మధ్య చిచ్చు పెడతానంటది.. అన్నట్టే చేసింది... దేశమంత కుటుంబం నాది... ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ములు... ఆభరణాలేసుకున్నోళ్లంత నా అక్క చెల్లెళ్ళు... అవసరం కొద్ది వాళ్ల జేబుల్లో చేతులు పెడితే... ఫ్యామిలీ మెంబర్‌ అని కూడా చూడకుండా నా మీద కేసులు పెడుతున్నారు... అయినా నేను హర్ట్‌ అవ్వలేదు... ఎందుకంటే అయినవాళ్ల దగ్గర తీసుకోవడం నా హక్కు... మై బేసిక్‌ రైట్‌. బికాజ్‌ ఇండియా ఈజ్‌ మై కంట్రీ. ఆల్‌ ఇండియన్స్‌ ఆర్‌ మై బ్రదర్స్‌ అండ్‌ సిస్టర్స్‌’ అంటూ నితిన్‌ చెప్పే  డైలాగ్స్‌ ఈ వీడియోలో ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్, ‘వెన్నెల’ కిశోర్‌ తదితరులు కీలక పాత్రల్లో  నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్‌.

Advertisement
 
Advertisement
Advertisement