పెట్రోలు బాంబు మంటల్లో హీరోకు గాయాలు

Rishab Shetty Fire Accident In Hero Shooting Set - Sakshi

సాక్షి, బెంగళూరు: కన్నడ సినిమా షూటింగ్‌లో కథానాయకుడు గాయపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ప్రముఖ కన్నడ నటుడు రిషబ్‌ శెట్టి హీరోగా నటిస్తోన్న ‘హీరో’ సినిమా షూటింగులో పెట్రోలు బాంబు మంటల్లో గాయపడ్డాడు. ఇటీవల హాసన్‌ జిల్లా బేలూరులో పోరాట దృశ్యాల చిత్రీకరణలో ఈ ఘటన జరిగింది. స్క్రిప్ట్‌ ప్రకారం పెట్రోల్‌ బాంబు విసిరి నటులు రిషబ్, గానావి లక్ష్మణ పరారీ కావాల్సి ఉంటుంది. అయితే బాంబు విసిరి పరిగెత్తే లోపు మంటలు అంటుకుని గాయపడినట్లు సమాచారం. 

చదవండి: (టాలీవుడ్‌లో తీవ్ర విషాదం..)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top