Rhea Chakraborty: వేలెత్తి చూపేలా ఎదుగు: సుశాంత్‌ సోదరి కామెంట్స్‌కి రియా కౌంటర్‌

Rhea Chakraborty Shares Note After Sushant Sister Said She Ruined His Life - Sakshi

రియా చక్రవర్తి.. పెద్ద పరిచయం అక్కర్లేని పేరు. హీరోయిన్‌గా తెరపై కంటే దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ మృతి, డ్రగ్స్‌ కేసులో ఈమే పేరు ఎక్కువగా వినిపించింది. సుశాంత్‌ ప్రియురాలైన రియా అతడి మృతి, డ్రగ్స్‌ కేసులో కీలక వ్యక్తిగా మారింది. 2020లో సంచలనం సృష్టించిన ఈ కేసు ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. ఈ కేసు విచారణ చేప్పట్టిన నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) రీసెంట్‌గా ఆమెపై చార్జీషీట్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్‌ మృతికి ఆమె ప్రధాన కారణమని, అతడికి డ్రగ్స్‌ కొని తెచ్చిందని ఎన్‌సీబీ పేర్కొంది.

చదవండి: లలిత్‌ మోదీ కంటే ముందు 9 మందితో సుష్మితా డేటింగ్‌, వారెవరంటే!

ఇప్పిటికే రియాపై పీకలదాకా కోపంతో ఉన్న సుశాంత్‌ కుటుంబ సభ్యులు ఎన్‌సీబీ చార్జిషీట్‌ అనంతరం గుప్పుమన్నారు. పలు సందర్భాల్లో రియాపై మాటల దాడికి దిగిన సుశాంత్‌ సోదరి ప్రియాంక సింగ్‌ తాజాగా ఆమెను టార్గెట్‌ చేస్తూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. ‘2019లో అన్నయ్య(సుశాంత్‌ సింగ్‌) జీవితంలోకి రియా వచ్చినప్పుడే మా జీవితాలు నాశనమయ్యాయి. సుశాంత్‌కు క్లబ్‌లు, పార్టీలు అలవాటు లేదు. అందుకే అందుకే బాలీవుడ్‌ పెద్దలు కొందరు రియాను నియమించి సుశాంత్‌ను అలా తయారు చేశారు’ అంటూ మండిపడింది. ఇక ఆమె కామెంట్స్‌పై రియా స్పందిస్తూ కౌంటర్‌ ఇచ్చింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో కొట్‌ను షేర్‌ చేసింది.

చదవండి: యంగ్‌ హీరో ఇంట తీవ్ర విషాదం

‘శబ్దానికి, ఈగోకు అతీతంగా ఎదుగు. నీవైపు వేలెత్తి చూపేలా ఎదుగు. ఎందుకంటే వారు చేరుకొలేని స్థానంలో నువ్వు ఉండాలి. నువ్వు ప్రశాంతంగా ఉండాలి. ప్రేమతో ఎగరాలి. ఏ కారణం లేకుండానే నువ్వు వారిపట్ల కరుణతో ఉండాలి. నువ్వు వారిని ఆశ్చర్యపరచాలి. నీలా నువ్వు ఉండు. అదే నువ్వు. అదే నీ జీవితం. అంతేకాని ఇతరులు చెప్పేలా నువ్వు ఉండకు’ అంటూ ఆసక్తిగా పోస్ట్‌ పెట్టింది. కాగా రియా, ఆమె సోదరుడు సోవిక్‌ చక్రవర్తితో పాటు మరో 34 మంది పేర్లను ఎన్‌సీబీ ఈ తమ చార్జీషీట్‌ల పేర్కొంది. కాగా రియా డ్రగ్స్‌ కొనుగోలు చేసి సుశాంత్‌కు ఇవ్వడం వల్లే అతడు ఈ అలవాటుకు బానిసయ్యాడని, సుశాంత్‌ మరణానికి రియా ఇచ్చిన డ్రగ్సే కారణమని ఎన్‌సీబీ తమ చార్జీషీట్‌లో వెల్లడించింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top