బాండ్‌ మళ్లీ వాయిదా | Release of James Bond film No Time To Die delayed | Sakshi
Sakshi News home page

బాండ్‌ మళ్లీ వాయిదా

Oct 4 2020 6:36 AM | Updated on Oct 4 2020 6:36 AM

Release of James Bond film No Time To Die delayed - Sakshi

కరోనా వైరస్‌ కారణంగా అన్ని సినిమాల్లానే బాండ్‌ సినిమా పరిస్థితి కూడా అయోమయంగా మారింది. జేమ్స్‌ బాండ్‌ సిరీస్‌లో వస్తున్న 25వ చిత్రం ‘నో టైమ్‌ టు డై’. ఇందులో డానియల్‌ క్రెగ్‌ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సింది. కోవిడ్‌ వల్ల నవంబర్‌కి విడుదలను వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమాను థియేటర్స్‌లోకి తీసుకువస్తున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌ అన్నింట్లో మా సినిమాను చూపించాలనుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యపడేలా లేదు. అందుకే విడుదలను వచ్చే ఏడాదికి వాయిదా వేశాం’ అన్నారు నిర్మాతలు.

Advertisement
 
Advertisement
Advertisement