‘పెళ్లైన మగాడి వెంట పడొచ్చా’.. రేఖ ఆన్సర్‌

Rekha Has an Epic Reply to Question About Falling For a Married Man - Sakshi

 ఇండియన్‌ ఐడల్‌ షో సీజన్‌ 12లో సందడి చేసిన రేఖ

బాలీవుడ్‌ అందాల నటి రేఖకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరికి వయసు పెరుగుతుంటే.. రేఖ విషయంలో మాత్రం అది యుక్త వయసులోనే ఆగిపోయింది. తన అందంతో ఎందరినో పిచ్చి వాళ్లని చేసిన రేఖ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఇక రేఖ-అమితాబ్‌ బచ్చన్ల ప్రేమ గురించి ప్రపంచానికంతా తెలుసు. ఒకానొక దశలో వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు ప్రచారం అయ్యాయి. అప్పటికే అమితాబ్‌ బచ్చన్‌కు జయతో వివాహం అయ్యింది. 

ఆ తర్వాత రేఖ.. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ముఖేష్‌ను వివాహం చేసుకున్నారు. అయితే అది కూడా ఎక్కువ కాలం సాగలేదు. పెళ్లైన ఏడు నెలలకే అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు కూడా అందరూ రేఖనే అనుమానించారు. ఇక వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న రేఖ.. బయటకు మాత్రం చిరునవ్వులు చిందిస్తూ.. సందడి చేస్తూ కనిపిస్తారు. తాజాగా శనివారం నాటి  ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 12లో ఇదే సీన్‌ రిపీట్‌ అయ్యింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రేఖ.. సెట్స్‌పై సందడి చేశారు. షణ్మఖప్రియ పాడిన పాటకు డ్యాన్స్‌ కూడా చేశారు. 

ఇక నిన్నటి షోలో యాంకర్‌ ఆదిత్య నారాయణ్‌ స్థానంలో వచ్చిన జయ్‌ భానుశాలి ఓ కంటెస్టెంట్‌ని ఉద్దేశించి.. ‘‘రేఖాజీ, నేహు(నేహా కక్కర్‌) ఒక స్త్రీ.. మగాడి కోసం.. అది కూడా పెళ్లైన వాడి కోసం పిచ్చిదానిలా వెంట పడటం ఎక్కడైనా చూశారా’’ అని ప్రశ్నిస్తాడు. అప్పుడు రేఖ వెంటనే ‘‘నన్ను అడగండి’’ అంటారు. ఆమె సమాధానంతో షాక్‌ తిన్న యాంకర్‌ రేఖ వైపు చూడగానే ‘‘నేనేం చెప్పలేదు’’ అంటూ దాటవేస్తారు. అందుకు జయ్‌.. వావ్‌.. మీరు సిక్సర్‌ బాదారు అని ప్రశంసిస్తాడు. ఇక రేఖ మాటలకు అక్కడున్న వారంతా పడి పడి నవ్వుతారు. లేచి నిల్చుని చప్పట్లతో ప్రశంసిస్తారు. 

ఇక నిన్నటి షోలో రేఖ ఇండియన్‌ ఐడల్‌కు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న నేహా కక్కర్‌కి‌ కాంజీవరం పట్టు చీర బహుకరించారు. అలానే మరో జడ్జి విశాల్‌ దల్దాని గుండు మీద సరదగా తబాలా వాయించారు. శనివారం నాటి ఏపిసోడ్‌లో రేఖ తన చిలిపి చేష్టలతో కంటెస్టెంట్లు, ప్రేక్షకులు హృదయాలను గెలిచారు. 

చదవండి: 
సరిగ్గా 30 ఏళ్ల క్రితం ఇలానే..
తెలుగు లేడీ కిశోర్‌ కుమార్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Author:
కె. రామచంద్రమూర్తి 

Read also in:
Back to Top