'ఆహా'లో భయపెట్టనున్న సైకలాజికల్‌ హర్రర్‌ వెబ్‌ సిరీస్‌ | Sakshi
Sakshi News home page

Anya's Tutorial Web Series: 'అన్యాస్‌ ట్యుటోరియల్‌' వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అప్పటినుంచే..

Published Mon, Jun 27 2022 11:11 AM

Regina Anyas Tutorial Web Series OTT Release Date Announced - Sakshi

Regina Anyas Tutorial Web Series OTT Release Date Announced: 'బాహుబలి' చిత్ర నిర్మాణ సంస్థ 'అర్కా మీడియా వర్క్స్‌' తాజాగా వెబ్‌ సిరీస్‌ రంగంలోకి ప్రవేశించింది. ఈ సంస్థ తెలుగు, తమిళం భాషల్లో రూపొందిన వెబ్ సిరీస్‌ 'అన్యాస్‌ ట్యుటోరియల్‌'. ఈ వెబ్‌ సిరీస్‌ ద్వారా పల్లవి గంగి రెడ్డి దర్శకురాలిగా పరిచయం అయ్యారు. హీరోయిన్‌ రెజీనా, నివేదిత సతీష్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌ సిరీస్‌ జులై 1 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. 

ఈ విషయం గురించి నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ ఇది తమ తొలి తమిళ వెబ్‌ సిరీస్‌ అని, ఆహాతో కలవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దర్శకురాలు పల్లవి మాట్లాడుతూ తాను ఆహాలో పనిచేశానని, ఈ సంస్థ మంచి కథలనే ఇష్టపడుతుందన్నారు. ఈ వెబ్ సిరీస్‌ రెండు భాషల్లో రూపొందించడం వల్ల ఎక్కువ శ్రమించాల్సి వచ్చిందన్నారు. 'అన్యాస్‌ ట్యుటోరియల్‌' వంటి సైకలాజికల్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ రావడం సంతోషకరం అని హీరోయిన్‌ రెజీనా పేర్కొంది. కాగా ఇటీవల విడుదలైన ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలకు మంచి స్పందన లభిస్తోంది. 

(చదవండి: హార్ట్‌ సింబల్స్‌తో సమంత ట్వీట్‌.. నెట్టింట వీడియో వైరల్‌..
మరోసారి జంటలుగా రానున్న హీరో-హీరోయిన్లు..
)Advertisement
 
Advertisement
 
Advertisement