ఆ విషయంలో ఎన్టీఆర్‌ బాగా హర్ట్‌ అయ్యాడా? అందుకే అమెరికాకు వెళ్లలేదా?

Reason Behind Jr NTR Why Did Go To USA - Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ విడుదలై ప్రపంచ వ్యాప్తంగా దుమ్ములేపింది. ఆస్కార్ అందుకోవటానికి అడుగు దూరంలో ఉంది. ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో వరుసగా గోల్డెన్ గ్లోబ్, లాస్ ఎంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్...హెచ్.సి.ఏ అవార్డ్స్ అందుకుంది. ఇక హెచ్.సి.ఏ అవార్డ్స్ లో హాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టి ఆర్‌ఆర్‌ఆర్‌ బెస్ట్ యాక్షన్ మూవీగా అవార్డ్ సొంతం చేసుకుంది. అమెరికాలో రాజమౌళి అండ్ టీమ్ ..హీరో మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఎన్టీఆర్ ప్యాన్స్ మాత్రం తమ హీరోకి అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియాలో ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్ ను ఏకి పడేస్తున్నారు..ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కూడా హార్ట్ అయ్యాడనే మాట తెరపైకి వచ్చింది

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా బాగుంది. వరల్డ్ వైడ్ గా మూవీ లవర్స్ అందరూ ఆదరించారు..ప్రశంసించారు. కానీ ఈ సినిమా విడుదలైనప్పడు నుంచి ఈ సినిమాలో ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్‌ పాత్రకే రాజమౌళి ప్రాధాన్యత ఇచ్చాడనే మాట ఎక్కువగా వినిపించింది. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గెటప్ లో డైరెక్టర్ రాజమౌళి ఇచ్చిన ఎలివేషన్స్ మూవీ లవర్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. అలాంటి ఎలివేషన్స్ జూనియర్ ఎన్టీఆర్ కి ఇవ్వలేదనేది నందమూరి ప్యాన్స్ ఆరోపణ. 

ఆస్కార్ ఎంట్రీ కోసం జూనియర్ ఎన్టీఆర్...చెర్రీ ....రాజమౌళి అండ్ టీమ్ దాదాపు రెండు నెలలు అమెరికాలో ఉండి చాలా కష్టపడ్డారు. ఆ సమయంలో హాలీవుడ్ పత్రికలు...ఫిల్మ్ క్రిటిక్స్ అందరూ జూనియర్ ఎన్టీఆర్ నటనని ఆకాశానికి ఎత్తేశారు. ఆస్కార్ బెస్ట్ యాక్టర్ రేస్ లో ఎన్టీఆర్ ఉంటాడని  హాలీవుడ్ మ్యాగజైన్ వైరటీ స్పెషల్ స్టోరీ రాసింది. అలాగే యూఎస్ఏ టుడే  పత్రిక  కూడా  ఎన్టీఆర్ యాక్టింగ్ ని తెగ పొగిడేసింది. 

ఇండియా..ఇంటర్ నేషనల్ పత్రికలు  కొమరం భీముడు పాత్రలో నటించిన ఎన్టీఆర్ కి ఆస్కార్ వస్తుందని ఊదరగొట్టారు. ఇక రాజమౌళి కూడా ఎన్టీఆర్ కి బెస్ట్ యాక్టర్ నామినేషన్స్ ఉంటాడనే  హామీ ఇచ్చాడనే ప్రచారం జరిగింది. దీంతో ఎన్టీఆర్ ఆస్కార్ పై ఆశలు పెట్టుకున్నాడట. చివరకి నాటు నాటు సాంగ్ కి మాత్రమే నామినేషన్ దక్కింది. దీంతో ఎన్టీఆర్  ఫ్యాన్స్ కూడా పాటు...ఎన్టీఆర్ కూడా బాగా డిస్పాయింట్ అయ్యాడనే మాట బాగా వినిపించింది. 

ఇక  ఆస్కార్ నామినేషన్ దక్కపోయినా...కనీసం  ఎన్టీఆర్ కి నేషనల్ బెస్ట్ అవార్డ్ వస్తుందని ఆశించారు ఫ్యాన్స్...అది కూడా రాలేదు. రాజమౌళి ఆస్కార్ పై పెట్టిన ఫోకస్...కాస్త ఇండియాలో కూడా పెట్టి ఉంటే నేషనల్  బెస్ట్ యాక్టర్  అవార్డ్ ఖచ్చితంగా ఎన్టీఆర్ కే వచ్చి ఉండేదని మరో వాదన తెరపైకి తీసుకువచ్చారు. రీసెంట్ గా   హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఆర్‌ఆర్‌ఆర్‌ చూసి చెర్రీ యాక్టింగ్ ను తెగ పొగిడాడు. ఈ విషయం తర్వాత ఎన్టీఆర్ బాగా హార్ట్ అనే మాట బాగా సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. అందుకే ఆస్కార్ అవార్డ్ వేడుకకి  కూడా అమెరికా వెళ్లటం లేదనే ప్రచారం జరుగుతోంది. అందుకే రామ్ చరణ్‌ ఒక్కడే అమెరికా వెళ్లిపోయాడనే మాట నెట్టింట ఎక్కువగా వినిపించింది. దీంతో హెచ్‌సీఏ వివరణ ఇచ్చింది. ఎన్టీఆర్‌కు తాము ఆహ్వానం అందించామని, కానీ ఆయన ఓ సినిమా షూటింగ్‌లో ఉండటం, ఆతర్వాత ఆయన సోదరుడు తారకరత్న చనిపోవడంతో ఆయన రాలేదని పేర్కొంది.

అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆస్కార్ అవార్డ్స్ ఫెస్టివల్ లో పాల్గొనబోతున్నాడు. తన అన్నయ్య తారకరత్న పెద్దకర్మ మార్చి 2న జరగబోతుంది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మార్చి నాలుగైదు తారీఖుల్లో జూనియర్ ఎన్టీఆర్ అమెరికా బయలు దేరతాడని తెలిసింది.  తన అన్నయ్య తారకరత్నకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో ఎన్టీఆర్ ఉండాలనుకున్నాడు...అందుకే చెర్రీ తో కలిసి ఎన్టీఆర్ అమెరికా వెళ్లలేదు. ఇలాంటి సమయంలో  కుటుంబానికి అండగా ఉండాలనే కారణంతోనే జూనియర్ ఎన్టీఆర్ కొన్ని రోజులు ఆలస్యంగా యూఎస్ కి బయలుదేరనున్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top