తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలా నేర్చుకున్నా

Real Star Upendra Speech At KABZAA Song Launch Event - Sakshi

– ఉపేంద్ర

‘‘తెలుగు సినిమా ఇండస్ట్రీని చూసి చాలా నేర్చుకుని, రాసుకుని సినిమాలు చేశాను. దర్శకుడు చంద్రు మూడేళ్లు కష్టపడి ‘కబ్జ’ చిత్రాన్ని ఇక్కడి వరకు తీసుకువచ్చారు’’అని ఉపేంద్ర అన్నారు. ఆర్‌.చంద్రు దర్శక నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘కబ్జ’. ఉపేంద్ర, శ్రియ జంటగా సుదీప్‌ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ మార్చి 17న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని నిర్మాత ఎన్ .సుధాకర్‌ రెడ్డి సమర్పణలో హీరో నితిన్‌ రుచిరా ఎంటర్‌టైన్ మెంట్స్, ఎన్‌. సినిమాస్‌ పతాకాలపై తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు.

ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్‌. ఆర్‌.చంద్రు మాట్లాడుతూ–‘‘మార్చి 17న పునీత్‌ రాజ్‌కుమార్‌గారి జయంతి.. ఆ రోజు మా ‘కబ్జ’ని రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఉపేంద్రగారితో వర్క్‌ చేయడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు శ్రియ. కాగా ఆస్కార్‌ ముంగిట నిలిచిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాను నిర్మించిన డీవీవీ దానయ్య, ‘నాటు నాటు..’ పాట రాసిన చంద్రబోస్‌ను ఉపేంద్ర అండ్‌ టీమ్‌ సత్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సాయినాథ్, హనుమంత రెడ్డి, లగడపాటి శ్రీధర్, హీరో విశ్వక్‌సేన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top