రూ. 40 కోట్ల సెట్‌లో రామ్‌ చరణ్‌-కియారాల రొమాంటిక్‌ సీన్స్‌! | RC 15: Rs 40 Crore Set For Ram Charan And Kiara Advani Scenes | Sakshi
Sakshi News home page

RC 15: రూ. 40 కోట్ల సెట్‌లో రామ్‌ చరణ్‌-కియారాల రొమాంటిక్‌ సీన్స్‌!

Nov 20 2021 6:47 PM | Updated on Nov 20 2021 7:57 PM

RC 15: Rs 40 Crore Set For Ram Charan And Kiara Advani Scenes  - Sakshi

రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు ఓ భారీ ప్యాన్‌ ఇండియా మూవీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఇటీవల పుణేలో పూర్తయిన సంగతి తెలిసిందే. ఇక సెకండ్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ సంబంధించిన ఓ క్రేజీ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. రామ్‌ చరణ్‌- కియారా అద్వాని మధ్య జరిగే రొమాంటిక్‌ సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నారట. ఇందుకోసం ఒక భారీ సెట్ వేయిస్తున్నారట.

చదవండి: పోలీసులను ఆశ్రయించిన నటి స్నేహా

ఈ సెట్‌ కోసం మేకర్స్‌ భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సెట్‌కు దాదాపు 40 కోట్లను కేటాయించినట్టుగా చెప్పుకుంటున్నారు. ‘శివాజీ’ సినిమాలోని ‘వాజీ వాజీ’ అనే పాట తరహాలో ఈ పాటను డిజైన్ చేశారట. ఈ పాట కోసమే అంత్యంత భారీ ఖర్చుతో సెట్ వేయిస్తున్నారని సినీ వర్గాల నుంచి సమాచారం. కేవలం పాట కోసం కాకుండా మరి కొన్ని సీన్స్‌ను కూడా ఇక్కడ ప్లాన్ చేసే అవకాశం ఉందట. ఏదేమైనా ఒక భారీ సెట్ మాత్రం రెడీ అవుతోందట. ఇక అందులో ఏం చేస్తారు? ఏం తీస్తారు? అనేది వెయిట్ చేయాలి. ఈ సినిమాలో శ్రీకాంత్‌, సునీల్, నటి అంజలి ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

చదవండి: ఆ నటుడితో పీకల్లోతు ప్రేమలో బిగ్‌బి మనవరాలు!

Advertisement
 
Advertisement
Advertisement