రావణాసుర విజయంపై నమ్మకం ఉంది | Ravi Teja talks about Ravanasura pre release event | Sakshi
Sakshi News home page

రావణాసుర విజయంపై నమ్మకం ఉంది

Apr 2 2023 3:45 AM | Updated on Apr 2 2023 3:45 AM

Ravi Teja talks about Ravanasura pre release event - Sakshi

సుధీర్‌వర్మ, సుశాంత్, రవితేజ, అభిషేక్‌ నామా

‘‘రావణాసుర’ చిత్రం నన్నెంతో అలరించింది. కచ్చితంగా ప్రేక్షకులందర్నీ కూడా అలరిస్తుందని నా ప్రగాఢ నమ్మకం. ఈ సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు రవితేజ. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘రావణాసుర’. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా నటించారు. అభిషేక్‌ నామా, రవితేజ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా శనివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రవితేజ మాట్లాడుతూ– ‘‘రావణాసుర’ టైటిల్, ఆ టైటిల్‌ డిజైన్‌ క్రెడిట్‌ నిర్మాత అభిషేక్‌కు దక్కుతుంది. అతను మల్టీటాలెంటెడ్‌ పర్సన్‌. ఈ సినిమా మంచి విజయం సాధించి నిర్మాతలుగా మాకు మంచి పేరు రావాలని, భవిష్యత్‌లో మేమిద్దరం కలిసి మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా హిట్‌తో సుధీర్‌ వర్మ నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్లాలి.

ఆర్‌టీ టీమ్‌ వర్క్స్‌ బ్యాక్‌బోన్స్‌ అయిన శేత, నమ్రత, వింధ్యా రెడ్డిగార్లకు థ్యాంక్స్‌. నా ఉత్సాహం, నా ప్రోత్సాహం నా అభిమానులే’’ అని అన్నారు. ‘‘రవితేజగారి నుంచి కొత్త విషయాలు నేర్చుకున్నాను. రిజల్ట్‌తో సంబంధం లేకుండా ప్రతి సినిమాకు కష్టపడాలని చెప్పారు. సుధీర్‌వర్మ అద్భుతమైన దర్శకుడు. ఆయన నన్ను కొత్తగా చూపించారనే అనుకుంటున్నాను’’ అన్నారు సుశాంత్‌. ‘‘రావణాసుర’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుంది’’ అన్నారు అభిషేక్‌ నామా.

‘‘రవితేజగారి ‘ఆంజనేయులు’ సినిమాకు దర్శకత్వ విభాగంలో వర్క్‌ చేశాను. దర్శకుడిగా ఆయనతో ఓ సినిమా చేయాలనుకున్నాను. ‘రావణాసుర’ వంటి మంచి స్టోరీకి డైరెక్టర్‌గా నన్ను సెలక్ట్‌ చేసుకున్న రవితేజగారికి ధన్యవాదాలు. ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్‌ హండ్రెండ్‌ పర్సెంట్‌ థ్రిల్‌ అవుతారు’’ అన్నారు సుధీర్‌వర్మ. మేఘా ఆకాష్, దక్షా నగార్కర్, పూజితా పొన్నాడ. మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ హర్షవర్థన్‌ రామేశ్వర్, భీమ్స్‌ సిసిరోలియో, రైటర్‌ శ్రీకాంత్‌ విస్సా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement