RT68 : ఇద్దరు భామలతో రవితేజ రొమాన్స్‌

Ravi Teja To Romance With Two Heroines In Rama Rao Onduty - Sakshi

మాస్‌ మహారాజా రవితేజ ప్రస్తుతం శరత్ మండవ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ కెరీర్‌లో 68వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇటీవలె రామారావు అనే టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ‘ఆన్ డ్యూటీ’ అనే క్యాప్షన్‌తో ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. రియ‌ల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా ఒక యూనిక్ థ్రిల్ల‌ర్‌గా ఈ మూవీ రూపొంద‌బోతుంది. ఈ మూవీలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ మూవీలో ఇప్పటికే మ‌జిలి ఫేమ్ దివ్యాంశ కౌశిక్‌తో పాటు రజిష విజయన్ హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top