రవితేజ దూకుడు..‘రామారావు ఆన్ డ్యూటీ’ పోస్టర్‌ వైరల్‌ | Ravi Teja Birthday Special Poster Out From Rama Rao On Duty | Sakshi
Sakshi News home page

రవితేజ దూకుడు..‘రామారావు ఆన్ డ్యూటీ’ పోస్టర్‌ వైరల్‌

Jan 26 2022 11:01 AM | Updated on Jan 26 2022 11:12 AM

Ravi Teja Birthday Special Poster Out From Rama Rao On Duty - Sakshi

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్‌డ్యూటీ’. రవితేజ 68వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీకి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు.  స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్లకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా రవితేజ పుట్టినరోజు(జనవరి 26) సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ మేకర్స్‌ కొత్త పోస్టర్‌ విడుదల చేశారు. 

యాక్షన్‌తో కూడిన ఈ పోస్టర్‌లో రవితేజ దూకుడుగా కనిపిస్తున్నాడు. అతనిలో దాగిఉన్న వివిధ భావోద్వేగాలను కూడా చూపిస్తుంది. ఒక చోట తన భార్యతో కనిపిస్తే, మరొక చోట ఫ్యామిలీతో కనిపిస్తున్నాడు. రామారావు ఆన్ డ్యూటీ అనేది అన్ని ఎమోషన్స్‌తో కూడిన చిత్రమని, అన్ని వర్గాలకు సంబంధించిన అంశాలు ఉంటాయని పోస్టర్‌ చూస్తే అర్థమవుతుంది. వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన మజిలీ బ్యూటీ దివ్యాన్ష కౌశిక్‌, రజిషా విజయన్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 25న ఈ చిత్రం విడుదల కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement