ఈగల్‌లో నన్ను కొత్తగా చూస్తారు | Sakshi
Sakshi News home page

ఈగల్‌లో నన్ను కొత్తగా చూస్తారు

Published Wed, Dec 27 2023 12:02 AM

Ravi Teja agle to release on January 13 2024 - Sakshi

రవితేజ హీరోగా కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఈగల్‌’. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, కావ్యా థాపర్‌ హీరోయిన్లు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది. అలాగే రవితేజ, శ్రీలీల జంటగా నక్కిన త్రినాథ రావు దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన హిట్‌ ఫిల్మ్‌ ‘ధమాకా’ విడుదలై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ‘ఈగల్‌ x ధమాకా’ సెలబ్రేషన్స్‌ను నిర్వహించారు మేకర్స్‌. ఈ వేడుకలో రవితేజ మాట్లాడుతూ– ‘‘ధమాకా’ విడుదలై ఏడాది పూర్తయిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. నిన్నో మొన్నో రిలీజైనట్లుగా అనిపిస్తోంది.

ఈ సినిమాతో హీరోయిన్‌గా శ్రీలీల, మ్యూజిక్‌ డైరెక్టర్‌గా భీమ్స్‌కు మంచి పేరు వస్తుందని ముందే చెప్పాను. అది నిజమైంది. ‘ధమాకా’ యూనిట్‌ సభ్యులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ఇక ‘ఈగల్‌’ విషయానికొస్తే... ఈ చిత్రంలో కొత్త రవితేజను చూస్తారు. కార్తీక్‌ ఘట్టమనేనికి దర్శకుడిగా మంచి భవిష్యత్‌ ఉందని నా నమ్మకం. నిర్మాత విశ్వగారితో నా జర్నీ కొనసాగుతుంది’’ అన్నారు. ‘‘అన్ని కమర్షియల్‌ అంశాలు ఉన్న మంచి చిత్రం ‘ఈగల్‌’. థియేటర్స్‌లో చూడండి’’ అన్నారు కార్తీక్‌ ఘట్టమనేని. ‘‘గత ఏడాదిని బ్లాక్‌బస్టర్‌తో ఎండ్‌ చేశాం. వచ్చే ఏడాదిని బ్లాక్‌బస్టర్‌తో ఆరంభిస్తాం’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్‌. అవసరాల శ్రీనివాస్, హైపర్‌ ఆది తదితరులు మాట్లాడారు.

Advertisement
 
Advertisement
 
Advertisement