Rashmika Mandanna Wants To Date With Prabhas, ఛాన్స్‌ వస్తే ఆ హీరోతో డేటింగ్‌కు వెళ్తా - Sakshi
Sakshi News home page

ఛాన్స్‌ వస్తే ఆ హీరోతో డేటింగ్‌కు వెళ్తా : రష్మిక

May 27 2021 6:53 PM | Updated on May 27 2021 9:38 PM

Rashmika Wants To Go On Date With Prabhas - Sakshi

రష్మిక మందన్నా.. ప్రస్తుతం దక్షిణాదిలో మోస్ట్‌ డిసైరబుల్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో నేషనల్‌ క్రష్‌గా మారిన రష్మిక అతి తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. కిరిక్‌ పార్టీ  అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మకు తక్కువ సమయంలోనే టాలీవుడ్‌ నుంచి పిలుపొచ్చింది. ఇక్కడ నటించిన తొలి సినిమా ‘ఛలో’తో సూపర్‌ హిట్‌ కొట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత విజయ్‌ దేవరకొండ ‘గీతగోవిందం’లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. 25 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ వరుసగా స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తూ బ్యాక్‌ టు బ్యాక్‌ ఆఫర్లతో యమ బిజీగా ఉంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..డేటింగ్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఒకవేళ తనకు అవకాశం వస్తే ఒకరోజు ప్రభాస్‌తో డేటింగ్‌కు వెళ్తానని చెప్పింది. తాను ప్రభాస్‌కు చాలా పెద్ద ఫ్యాన్‌ అని మనసులో మాటను బయటపెట్టేసింది. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్‌ సరసన పుష్ప మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా ఇటీవలె కార్తీ సరసన నటించిన సుల్తాన్‌ చిత్రంతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.ఈ సినిమా ఫ్లాప్‌ అయినప్పటీకీ.. రష్మిక పాత్రకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక బాలీవుడ్‌లో 'మిషన్ మజ్ను' సినిమాతో పాటు అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి గుడ్ బాయ్ అనే సినిమాలో నటిస్తుంది ఈ కన్నడ బ్యూటీ. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి :Rashmika Mandanna: డేటింగ్‌ అంటే ఏంటో తెలీదంటున్న రష్మిక
హీరోగా జూ.ఎన్టీఆర్‌ అందుకున్న ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement