Actress Rashmika Mandanna Comments On Dating In Instagram Live - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: డేటింగ్‌ అంటే ఏంటో తెలీదంటున్న రష్మిక

Apr 28 2021 4:49 PM | Updated on Apr 29 2021 10:34 AM

Rshmika Mandanna Comments On Dating In Instagram Live - Sakshi

ఇండస్ట్రీకి వచ్చిన కొన్ని రోజుల్లోనే స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌ సంపాదించింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా.

ఇండస్ట్రీకి వచ్చిన కొన్ని రోజుల్లోనే స్టార్‌ హీరోయిన్‌ రేంజ్‌ సంపాదించింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. క్షణం తీరిక లేకుండా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక..  సౌత్‌ ఇండస్ట్రీతోపాటు బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో తెలుగులో పుష్ప.. హిందీలో సిద్ధార్థ్‌ మల్హోత్రతో కలిసి మిషన్‌ మజ్ను, అమితాబ్‌ ముఖ్యపాత్రలో రూపొందుతున్న గుడ్‌ బై చిత్రాలు. ఉన్నాయి. ఓ వైపు  ఇన్ని సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది రష్మిక. ఇటీవల(ఆదివారం)ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లోకి వచ్చింది. 

చాలా రోజుల తరువాత రష్మిక లైవ్‌లోకి రావడంతో ఫాన్స్‌ ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానలిచ్చింది. ఇందులో భాగంగా డేటింగ్‌పై చర్చ జరిగింది. ఓ వ్యక్తి డేటింగ్‌ గురించి అడగ్గా.. తనకలాంటి విషయాలు తెలియదంటూ చెప్పింది.

డేట్‌ అంటే ఏంటని, డేట్‌కి వెళ్లి ఏం చేస్తారంటూ అమాయకంగా ప్రశ్నించింది. ఇది విన్న నెటిజన్లు రష్మికపై సెటైర్లు వేస్తున్నారు. డేట్‌ అంటే తెలియకుండానే కన్నడ దర్శకుడు, హీరో రక్షిత్ శెట్టితో ప్రేమాయణం నడిపి నిశ్చితార్థం వరకూ వెళ్ళిందా!? అని ప్రశ్నిస్తున్నారు. రష్మిక మరీ అంత అమాయకంగా జోక్స్‌ పేలిస్తే ఎలా అని వ్యంగ్యంగా కామెంట్‌ చేస్తున్నారు. 

చదవండి:
ఆ విషయాన్ని మీరు విజయ్‌నే అడగండి : రష్మిక

100 కోట్ల సినిమా కంటే ఇదే ఎక్కువ సంతృప్తి: సోనూసూద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement