Rashmika Mandanna Shares FIRST PIC From Maldives Vacation with Vijay - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: మాల్దీవుల్లో రష్మిక- విజయ్.. ఫోటో షేర్ చేసిన ముద్దుగుమ్మ

Oct 8 2022 4:27 PM | Updated on Oct 8 2022 10:22 PM

Rashmika Mandanna Shares FIRST PIC From Maldives Vacation with Vijay  - Sakshi

పుష్ప భామ రష్మిక మందన్నా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే ఆమె నటించిన బాలీవుడ్ మూవీ గుడ్‌బై థియేటర్లలో సందడి చేస్తోంది. ప్రస్తుతం కొద్దిరోజులు వ్యాకేషన్ కోసం మాల్దీవులకు చెక్కెసింది ఈ నేషనల్ క్రష్. టాలీవుడ్‌తో స్టార్‌డమ్‌ సంపాందించుకున్న ఈ అమ్మడు కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ నటిస్తోంది. తాజాగా మాల్దీవుల్లో విజయ్‌ దేవరకొండతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు అది కాస్తా వైరలవుతోంది. 

నిన్న టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఇద్దరు కలిసి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ వ్యాకేషన్‌కు వెళ్లినట్లు భావించారు. అందరూ అనుకున్నట్లుగానే విజయ్‌తో కలిసి మాల్దీవుల వెకేషన్‌లో ఉన్న ఫోటోను పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. అందమైన డ్రెస్‌లో ఉన్న రష్మిక మందన్నా మిర్రర్ సెల్ఫీని షేర్ చేసింది.'హాయ్ లవ్స్ విత్ ఎ వైట్ హార్ట్ ' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. కాగా గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించిన విజయ్‌-రష్మికల కెమిస్ట్రీకి ఎంతో మంది అభిమానులున్న సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement