బీచ్‌లో హీరోయిన్‌ రష్మిక వర్క్‌ అవుట్స్‌ | Rashmika Mandanna Shares first Beach Workout | Sakshi
Sakshi News home page

బీచ్‌లో రష్మిక వర్క్‌ అవుట్స్‌

Sep 30 2020 6:17 PM | Updated on Sep 30 2020 6:53 PM

Rashmika Mandanna Shares first Beach Workout  - Sakshi

హీరోయిన్‌ రష్మిక మందన్నా అతి కొద్ది కాలంలోనే టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. సరిలేరునీకెవ్వరుతో హిట్‌ అందుకున్న ఈ భామ, వరుస విజయాలతో దూసుకుపోతోంది. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే  రష్మిక తన ఫోటోల‌తో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటుంది. ఆమెకు సోషల్‌ మీడియాలో 9 మిలియన్ల మంది కంటే ఎక్కువమందే ఫాలోవర్స్‌ ఉన్నారు. తాజా రష్మిక బీచ్‌లో వర్క్‌ అవుట్స్‌ చేస్తున్న వీడియోను తన సోషల్‌ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది. ఇక వీడియో చూసిన వారందరూ రష్మిక చాలా కష్టపడుతుంది, లుక్‌ వావ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ వీడియోను షేర్‌ చేసిన రష్మిక మొదటిసారి బీచ్‌లో వర్క్‌ అవుట్స్‌ చేస్తున్నానని, ఇలా ఇసుకలో, ఆస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ వర్క్‌ అవుట్‌ చేయడం చాలా బాగుందని రాసుకొచ్చింది. 

చదవండి: చిటికేస్తే జరిగిపోవాలి!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement