Rashmika Mandanna Maldives Vacation, Pics Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: మాల్దీవుస్ ఫోటో షేర్ చేసిన పుష్ప బ్యూటీ.. సోషల్ మీడియాలో వైరల్

Oct 9 2022 5:37 PM | Updated on Oct 9 2022 6:11 PM

Rashmika Mandanna Maldives Vacation Pics Goes Viral On Social Media - Sakshi

పుష్ప భామ రష్మిక మందన్నా, విజయ్‌ దేవరకొండపై గాసిప్స్ గుప్పమంటున్నాయి. ఇటీవలే వ్యాకేషన్ కోసం మాల్దీవులకు చెక్కేయగా ఈ జంటపై సోషల్ మీడియాలో రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా బ్లాక్‌ కలర్ సన్‌గ్లాసెస్‌తో మాల్దీవుల్లో ఉన్న ఓ ఫోటోను ఆమె షేర్ చేశారు. దీంతో అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఆ సన్‌ గ్లాసెస్‌ విజయ్‌ దేవరకొండవే అని.. ఇద్దరు కలిసి వ్యాకేషన్‌కు వెళ్లారని పోస్టులు పెడుతున్నారు. 

(చదవండి: ప్రేమించడానికి టైమ్‌ లేదు : రష్మిక మందన్నా)

రష్మిక తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చున్న ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో ఓ పువ్వును పట్టుకుని తెల్లటి బుట్ట వైపు చూస్తూ కూర్చుంది. ఆమె తన పోస్ట్‌కు సన్‌ఫ్లవర్‌తో పాటు రెడ్‌హార్ట్‌ సింబల్‌ను జోడించింది.  మాల్దీవుల్లోని ఓజెన్‌ రిజర్వ్‌ బోలిఫుషిగా ప్రాంతాన్ని జియో ట్యాగ్ చేసింది ఈ బుట్టబొమ్మ. కాగా.. రష్మిక, విజయ్ ఈ ఏడాది బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అమితాబ్ బచ్చన్,  నీనా గుప్తా నటించిన గుడ్‌బై చిత్రంలో రష్మిక నటించింది. విజయ్ అనన్య పాండేతో లైగర్‌తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్‌లో విజయ్స, రష్మిక జోడి గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement