Rashmika Mandanna Latest GYM Workout Video Goes Viral - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: ఎగిరెగిరి తన్నిన రష్మిక.. ఏ దర్శకుడైనా అలా అడుగుతాడా?

Oct 23 2021 1:47 PM | Updated on Oct 23 2021 2:04 PM

Rashmika Mandanna Gym Workout Video Goes Viral - Sakshi

ఈ వీడియో చూశాక ఏ దర్శకుడైనా  ఆ పని చేయమని అడుగుతాడా?

ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫిట్ నెస్ కోసం టైమ్‌ కేటాయిస్తుంది స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్నా. తన శరీరాన్ని సరైన ఆకృతిలో ఉంచడం కోసం వారానికి కనీసం 4,5 సార్లు జిమ్ లో గడుపుతుందట. ఒకవేళ జిమ్ కు వెళ్లలేకపోతే.. యోగా అయినా చేస్తుంది. ఖాళీగా ఉంటే రోజులో ఎక్కువ భాగం జిమ్‌లోనే కాలం గడిపేస్తూ ఉంటుంది. ఆ వర్కవుట్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుంది. అవి వైరల్ అవుతూంటాయి.

తాజాగా ఆమె జిమ్‌ సెంటర్‌ వర్కౌట్‌ చేస్తున్న వీడియోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అందులో రష్మిక  తన ఫిట్‌నెస్ ట్రైనర్ పట్టుకున్న స్ట్రైకింగ్ ప్యాడ్‌ను పదేపదే తన్నుతున్నట్లు చూడొచ్చు. ఆమె ఎగిరెగిరి తన్నుతుంటే..మరింత గట్టిగా తన్ను అంటూ రష్మికను ప్రోత్సహిస్తున్నాడు ట్రైనర్‌. ఈ వీడియోని రష్మిక ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. చాలా కోపంగా ఉన్నప్పుడు నేను ఏమి చేస్తాను’అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. రష్మిక వీడియోకి నటుడు, దర్శకుడు తనదైన శైలీలో స్పందిచాడు. ‘ఈ వీడియో చూశాక ఏ దర్శకుడైనా నిన్ను రీటేక్‌ కోసం అడుగుతాడా? టేక్‌ ఓకే’ అంటూ కామెంట్‌ చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement