ఆ వివాదంపై పుష్ప భామ క్లారిటీ.. మీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ..! | Rashmika Mandanna Clarity On Sandalwood ban On Her | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: ఆ విషయాలు బయటకు చెప్పాల్సిన అవసరం లేదు: రష్మిక మందన్నా

Dec 8 2022 9:34 PM | Updated on Dec 8 2022 11:29 PM

Rashmika Mandanna Clarity On Sandalwood ban On Her  - Sakshi

సౌత్‌ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నటి రష్మిక మందన్నా. ఆమెపై కన్నడ ఇండస్ట్రీ బ్యాన్‌ విధించనుందని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ వార్తలపై పుష్ప బ్యూటీ స్పందించింది. తనపై ఎలాంటి నిషేధం లేదని మీడియాకు వివరించింది.  ఓ బాలీవుడ్‌ మీడియాతో తన ఫస్ట్‌ మూవీ గురించి రష్మిక చేసిన కామెంట్స్‌ ఈ వివాదానికి కారణమయ్యాయి. టాలీవుడ్‌లో అగ్ర హిరోయిన్‌గా వెలుగొందుతున్న ఈ కన్నడ భామ ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.  

(ఇది చదవండి: కన్నడలో రష్మికపై బ్యాన్‌! ‘శ్రీవల్లి’ ఏమన్నదంటే..)

రష్మిక మాట్లాడుతూ.. 'కాంతార విషయంలో నాపై కొందరు అత్యుత్సాహం చూపించారు. ఆ మూవీ చూశాకా నేను మేసేజ్ పెట్టా. నటీనటుల మధ్య జరిగే విషయాలు ప్రేక్షకులకు తెలియవు. నా పర్సనల్ విషయాలను కెమెరా ముందు అందరికీ చూపించలేను. నా వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పలేను. నాకు అంత అవసరం కూడా లేదు. వృత్తిపరంగా ఏం చేస్తున్నానో అభిమానులకు చెప్పడం నా బాధ్యత' అంటూ పుష్ప ముద్దుగుమ్మ స్పష్టం చేసింది. 

ఇటీవల అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటించిన తొలి చిత్రం గుడ్‌ బై  బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం మరో రెండు హిందీ చిత్రాల్లో నటిస్తోంది. ఆ రెండు చిత్రాల విజయాలపైనే అక్కడ ఆమె భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. టాలీవుడ్‌లో పుష్ప 2 చిత్రం ఒకటే రష్మిక చేతులో ఉంది. ఇకపోతే కోలీవుడ్‌లో విజయ్‌తో కలిసి చేస్తున్న వారిసు చిత్రంపై ఈ బ్యూటీ చాలా ఆశలు పెట్టుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement