Rashi Khanna: ఆడా ఉంటా... ఈడా ఉంటా!

Rashi Khanna Approached As Heroine Upcoming Movie With Dhanush - Sakshi

కోలీవుడ్‌లో రాశీఖన్నా హవా కనిపిస్తోంది. ఇప్పటికే ‘అరణ్‌మణై 3’, విజయ్‌ సేతుపతి ‘తుగ్లక్‌ దర్బార్‌’ సినిమాల షూటింగ్స్‌ను పూర్తి చేసి, తాజాగా కార్తీ ‘సర్దార్‌’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారామె. ఇప్పుడు కోలీవుడ్‌ నుంచి రాశీ మరో కబురు అందుకున్నారట. ధనుష్‌ హీరోగా మిత్రన్‌ జవహర్‌ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాకి హీరోయిన్‌గా రాశీఖన్నాని సంప్రదించారని సమాచారం.

మరోవైపు తెలుగులో నాగచైతన్య ‘థ్యాంక్యూ’, గోపీచంద్‌ ‘పక్కా కమర్షియల్‌’ చిత్రాలు చేస్తున్నారీ బ్యూటీ. ప్రస్తుతం హిందీలో షాహిద్‌ కపూర్‌ ‘సన్నీ’ (వర్కింగ్‌ టైటిల్‌), అజయ్‌ దేవగణ్‌ ‘రుద్ర’ వెబ్‌ సిరీస్‌ల షూటింగ్‌లతో రాశీఖన్నా బిజీగా ఉంటున్నారు. ఇలా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నటిస్తూ ఆడా ఉంటా... ఈడా ఉంటా అంటూ సౌత్, నార్త్‌లలో దూసుకెళుతున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top