బర్త్‌డే పార్టీ!: మీ సోదరుడు చనిపోయాడు, గుర్తుందా? | Randhir Kapoor Trolled For Get Together On Birthday | Sakshi
Sakshi News home page

రణ్‌ధీర్‌ కపూర్‌ బర్త్‌డే: నెటిజన్ల ట్రోలింగ్‌

Feb 16 2021 8:59 PM | Updated on Feb 17 2021 4:13 AM

Randhir Kapoor Trolled For Get Together On Birthday - Sakshi

ఆల్కహాల్‌కు బానిసైన రాజీవ్‌ కపూర్‌ ఫిబ్రవరి 9న ప్రాణాలు విడిచిన విషయం విదితమే. ఆయన చనిపోయి పట్టుమని పది రోజులైనా కాకముందే కుటుంబం అంతా కలిసి రణ్‌ధీర్‌ కపూర్‌ బర్త్‌డే సందర్భంగా గెట్‌ టు గెదర్‌ ఏర్పాటు చేసింది. ఈ పుట్టినరోజును పురస్కరించుకుని రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌, నీతూ కపూర్‌, కరీనా కపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌, కరిష్మా కపూర్‌ సహా పలువురు సెలబ్రిటీలు రణ్‌ధీర్‌ నివాసానికి వెళ్తూ కెమెరాలకు చిక్కారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట చక్కర్లు కొట్టగా చాలామంది నెటిజన్లు నోరెళ్లబట్టారు.

"మీ కుటుంబంలో ఒకరు చనిపోయారు. ఆ విషయం మీకు గుర్తుందా?", "రాజీవ్‌ మరణించి కొద్ది రోజులు కూడా కాలేదు, అయినా వీళ్లు ఎలా వేడుకలు చేసుకుంటున్నారో?" అంటూ నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. మీ సోదరుడు చనిపోయిన వారం రోజులకే పార్టీ ఎలా చేసుకోగలుగుతున్నారని అసహనంతో ఊగిపోతూ కపూర్‌ ఫ్యామిలీని దారుణంగా ట్రోల్‌ చేశారు. దీంతో ఈ వార్తలపై రణ్‌ధీర్‌ కపూర్‌ స్పందించాడు. "ఇది అందరం కలుసుకున్న ఓ చిన్న సమావేశం లాంటిది. అంతే తప్ప పార్టీ కాదు" అని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికీ రాజీవ్‌ లేడన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని, ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నాడు.

కాగా రిషి కపూర్‌, రణ్‌ధీర్‌ కపూర్‌, రాజీవ్‌ కపూర్‌ ముగ్గురు సొంత అన్నదమ్ములు. వీరిలో రిషి కపూర్‌ హీరోగా హిట్టవ్వగా, రణ్‌ధీర్‌ కపూర్ హీరోగా నిలబడలేకపోయాడు. చిన్నవాడైన రాజీవ్‌ కపూర్‌ కూడా హిట్‌ హీరో కాలేకపోయాడు. చింపూ కపూర్‌ అని అందరూ పిలిచే రాజీవ్‌ కపూర్‌ దర్శకనిర్మాతగానూ విఫలమవడంతో ఇండస్ట్రీకి దూరం అయ్యాడు.

చదవండి: మాధురీ దీక్షిత్‌, సంజయ్‌దత్‌ లవ్‌ స్టోరీ..

నెట్టింట్లో సినీతారలు: స్టైల్‌గా ల్యాండైన లైగర్‌

షారుక్‌ 'పఠాన్‌'లో సల్మాన్‌: క్లారిటీ ఇచ్చిన హీరో‌

చింపూ కపూర్‌ ఓడి వెళ్లిపోయాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement