Rana Daggubati: తమిళ హిట్‌ మూవీని రీమేక్‌ చేయనున్న రానా?

Rana Daggubati To Starer In Simbus Maanadu Movie - Sakshi

Rana Daggubati To Starer In Simbus Maanadu Movie: శింబు హీరోగా ఇటీవల వచ్చిన మానాడు చిత్రం​ సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శింబుకు జోడీగా  కల్యాణి ప్రియదర్శన్‌ నటించింది. పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది.

తాజాగా ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. ఇప్పటికే సురేష్‌ ప్రొడక్షన్‌ రీమేక్‌ హక్కులను సొంతం చేసుకున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. ఈ ప్రాజెక్టులో రానా కనిపించనున్నట్లు తెలుస్తుంది. ఇక రానా నటించిన '1945' సినిమా ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top