డ్యాన్స్‌తో కుర్చీ మడత పెట్టేసిన 'మహేశ్‌ బాబు' అన్న కూతురు | Sakshi
Sakshi News home page

డ్యాన్స్‌తో కుర్చీ మడత పెట్టేసిన 'మహేశ్‌ బాబు' అన్న కూతురు

Published Mon, Feb 19 2024 11:44 AM

Ramesh Babu Daughter Bharathi Dance Mahesh Babu Song - Sakshi

మహేశ్‌బాబు-  త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన యాక్షన్‌ డ్రామా చిత్రం 'గుంటూరుకారం'. సంక్రాంతి కానుకగా  వచ్చిన ఈ చిత్రం యూత్‌ నుంచి కుటుంబ ప్రేక్షకుల వరకు మెప్పించింది. మొదట ఈ సినిమా బాగాలేదని అన్నవారితోనే కొన్నిరోజుల తర్వాత మళ్లీ చూసి.. అరే సినిమా బాగుందే అనే కితాబు ఇచ్చారు.  నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ వేదికగా ఈ చిత్రాన్ని భారీగా చూస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలోని కుర్చీ మడత పెట్టి అనే పాట ఒక రేంజ్‌లో హిట్‌ అయింది. ఈ పాట నుంచి మిలియన్ల కొద్ది రీల్స్‌ నెట్టింట వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి మహేశ్‌ బాబు అన్న రమేశ్‌ బాబు కూతురు భారతి కూడా చేరింది.

భారతి ఘట్టమనేని చేసిన ఈ డ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. తన బాబాయ్‌ మహేశ్‌ పాటకు భారతి వేసిన స్టెప్పులు ఇన్‌స్టాగ్రామ్‌లో దుమ్మురేపుతున్నాయి. ఇప్పటికే ఇదే పాటకు మహేశ్‌ కూతురు సితార కూడా ఒక రీల్‌ చేసింది. అప్పుడు కూడా సితార వేసిన స్టెప్పులకు మిలియన్ల కొద్ది వ్యూస్‌ వచ్చాయి. ఇప్పుడు మళ్లీ తన అన్న కూతురు భారతి కూడా కుర్చీ మడత పెట్టేసింది. ప్రస్తుతం ఆమె ఫారిన్‌లో చదువుకుంటున్నట్లు సమాచారం.

రమేశ్‌ బాబు కూడా తన తండ్రి కృష్ణ‌తో కలిసి పలు సినిమాల్లో కనిపించారు. చివరిగా ఎన్‌కౌంట‌ర్ అనే చిత్రంలో తండ్రితో క‌లిసి న‌టించిన ర‌మేశ్‌బాబు  త‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. కానీ కొంత కాలం తర్వాత తన సోదరుడు అయిన మహేశ్‌తో కలిసి అర్జున్‌, అతిథి చిత్రాలను నిర్మించాడు. కానీ ఆయన పిల్లలు భారతి, జయ కృష్ణ‌ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. కానీ తాజాగా భారతి చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. శ్రీలీల రేంజ్‌లో దుమ్మురేపిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతలా ఆమెపై పొగ‌డ్త‌ల వ‌ర్షంలో ముంచెత్తుతున్న ఆ సాంగ్‌ను మీరూ చూసేయండి.

Advertisement
 
Advertisement