Ram Pothineni The Warrior Movie Teaser Out Now - Sakshi
Sakshi News home page

The Warriorr Teaser: పాన్‌ ఇండియా సినిమాలు చూసుంటారు, పాన్‌ ఇండియా రౌడీలను చూశారా?

May 14 2022 6:12 PM | Updated on May 14 2022 7:27 PM

Ram Pothineni The Warrior Movie Teaser Out Now - Sakshi

'పోలీసోళ్ల టార్చర్‌ భరించలేకపోతున్నామప్పా.. ఇంతకుముందు సైలెంట్‌గ ఉండేటోళ్లు ఇప్పుడు వయొలెంట్‌గా లోపలేస్తాండారు.. ఈ మధ్య సత్య అని ఒకడొచ్చినాడు..' అంటూ హీరో రామ్‌ గురించి ఎలివేషన్‌ ఇచ్చారు.

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని నటిస్తున్న ద్విభాషా చిత్రం వారియర్‌. పందెంకోడితో హిట్‌ దర్శకుడిగా తెలుగునాట పేరు సంపాదించిన లింగుసామి దర్శకత్వం వహించాడు. శనివారం(మే 14న) ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ అయింది. 'పోలీసోళ్ల టార్చర్‌ భరించలేకపోతున్నామప్పా.. ఇంతకుముందు సైలెంట్‌గ ఉండేటోళ్లు ఇప్పుడు వయొలెంట్‌గా లోపలేస్తాండారు.. ఈ మధ్య సత్య అని ఒకడొచ్చినాడు..' అంటూ హీరో రామ్‌ గురించి ఎలివేషన్‌ ఇచ్చారు.

'పాన్‌ ఇండియా సినిమా చూసుంటారు, పాన్‌ ఇండియా రౌడీలను చూశారా? డియర్‌ గ్యాంగ్‌స్టర్స్‌.. వీలైతే మారిపోండి, లేదంటే పారిపోండి' అని రామ్‌ చెప్పిన డైలాగులు బాగున్నాయి. యంగ్‌ హీరో ఆది పినిశెట్టి విలన్‌ రోల్‌లో కనిపించగా హీరోయిన్‌ కృతీశెట్టి అందచందాలతో ఆకట్టుకుంటోంది. పవన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన వారియర్‌ మూవీ తెలుగు, తమిళ భాషల్లో జూలై 14న రిలీజ్‌ కానుంది. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించిన ఈ మూవీలో నటుడు శింబు బుల్లెట్‌ సాంగ్‌ను తెలుగు, తమిళం భాషల్లో పాడటం విశేషం.

చదవండి: నేనే కాదు, నా భర్త కూడా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు: నటి

జాన్‌ అబ్రహం, రకుల్‌ మూవీ 'యాక్షన్‌', ఎప్పటినుంచంటే?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement