Ram Gopal Varma Satirical Comments On Garikapati Narasimha Rao And Chiranjeevi's Controversy - Sakshi
Sakshi News home page

Ram Gopal Varma Tweet: గరికపాటిపై ఆర్జీవీ ఘాటు వ్యాఖ్యలు, నువ్వేంటో..!

Published Mon, Oct 10 2022 10:02 PM

Ram Gopal Varma Sensational Comments On Garikapati Narasimharao - Sakshi

ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు, మెగాస్టార్‌ల మధ్య జరిగిన వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. వివాదాస్పద కామెంట్లు చేసే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తాజాగా ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. దీనిపై నాగబాబు చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ ఆర్జీవీ గరికపాటిని విమర్శించారు. ‘మిమ్మల్ని మెగా ఫ్యామిలీ క్షమించినా.. అభిమానులైన మేం వదిలే ప్రసక్తే లేదంటూ’ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఆర్జీవీ ఆ ట్వీట్‌లో తనదైన శైలిలో గరికపాటిపై విరుచుకుపడ్డారు.

వివాదం ఎక్కడ మొదలైందంటే! 
ప్రముఖ సినీనటుడు చిరంజీవిని ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో దుమారమే రేగింది. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో ‘చిరంజీవి ఫొటో సెషన్‌ ఆపేసి రాకపోతే నేనే వెళ్లిపోతా’ అని గరికపాటి అసహనం వ్యక్తం చేయడంతో ఆ వ్యాఖ్యలు వివాదానానికి దారి తీశాయి.

అయితే ఆ కార్యక్రమంలో చిరంజీవి, గరికపాటి బాగానే మాట్లాడుకున్నా.. ఆ తరువాత నరసింహారావు వ్యాఖ్యలపై చిరంజీవి సోదరుడు నాగబాబు ట్విట్టర్‌లో ఆయన పేరు ప్రస్తావించకుండా ‘ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్‌ చూస్తే ఆ పాటి అసూయపడటం పరిపాటే’నని స్పందించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement