అభిమానం పది లక్షలు  | Ram Charan Makes New Record By Reaching Million Followers In Twitter | Sakshi
Sakshi News home page

అభిమానం పది లక్షలు 

Nov 11 2020 12:43 AM | Updated on Nov 11 2020 12:47 AM

Ram Charan Makes New Record By Reaching Million Followers In Twitter - Sakshi

హీరో రామ్‌చరణ్‌ సోషల్‌ మీడియాలో కొత్త రికార్డు సృష్టించారు. ట్విట్టర్‌ ఖాతా ప్రారంభించిన అతి తక్కువ కాలంలో ఒక మిలియన్‌ (పది లక్షలు) ఫాలోయర్స్‌ను సొంతం చేసుకున్నారు. అంతకుముందు చరణ్‌ సోషల్‌ మీడియాలో ఉన్నప్పటికీ మధ్యలో గ్యాప్‌ తీసుకున్నారు. అయితే ఈ ఏడాది మార్చిలో చరణ్‌ మళ్లీ ట్విట్టర్లోకి అడుగుపెట్టారు. కేవలం 233 రోజుల్లోనే పది లక్షల ఫాలోయర్లను ఆయన సొంతం చేసుకోవడం విశేషం. తన సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు చరణ్‌. అభిమాన హీరో పదిలక్షల మార్కును చేరుకోవడంతో మెగా అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. రామ్‌చరణ్‌ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్‌ మరో హీరో అని తెలిసిందే. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో రామ్‌చరణ్‌ కనిపించే అవకాశం ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement