హీరో రామ్‌చరణ్‌కు బాహుబలి కాజాతో సత్కారం​ | Ram Charan Honored With Bahubali Kaja | Sakshi
Sakshi News home page

హీరో రామ్‌చరణ్‌కు బాహుబలి కాజాతో సత్కారం​

Mar 6 2022 2:08 PM | Updated on Mar 6 2022 2:11 PM

Ram Charan Honored With Bahubali Kaja - Sakshi

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా, క్రియేటివ్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో ఆర్‌సీ15 రూపొందుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా రామ్‌చరణ్‌ కెరీర్‌లో 15వ చిత్రం. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ కోసం రాజమహేంద్రవరం వెళ్లిన రామ్‌చరణ్‌కు తాపేశ్వరం సురుచి పీఆర్‌ఓ వర్మ బాహుబలి కాజాను అందజేశారు. జిల్లాకు ప్రముఖులు ఎవరు వచ్చినా వారికి గౌరవ పూర్వకంగా బాహుబలి కాజాను ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది.

షెల్టాన్‌ హోటల్‌లో జరిగిన ఫోటోషూట్‌లో రామ్‌చరణ్‌కు వర్మ ఈ కాజాను బహుకరించారు. కాగా ఆర్‌సీ15 చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు  నిర్మిస్తున్నారు. శిరీష్ దీనికి సహ నిర్మాత.అంజలి, సునీల్‌, జయరామ్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement