'గేమ్‌చేంజర్‌' టార్గెట్‌ ఫిక్స్‌.. రిలీజ్‌ ఎప్పుడంటే? | Ram Charan Game Changer Movie Release Date Confirmed, Check Interesting Deets About This - Sakshi
Sakshi News home page

Game Changer Movie Update: 'గేమ్‌చేంజర్‌' టార్గెట్‌ ఫిక్స్‌.. రిలీజ్‌ ఎప్పుడంటే?

Published Sat, Feb 24 2024 1:40 AM

Ram Charan Game Changer Release Date - Sakshi

హీరో రామ్‌చరణ్, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ‘గేమ్‌చేంజర్‌’. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఐఏఎస్‌ ఆఫీసర్‌ రామ్‌నందన్‌పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారని తెలిసింది. ఇటీవల ‘గేమ్‌చేంజర్‌’ సినిమా కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్స్‌ అన్బు, అరివు డిజైన్‌ చేసిన ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరణలో రామ్‌చరణ్‌ పాల్గొంటున్నారు.

ఈ యాక్షన్‌ సీక్వెన్స్‌తోపాటుగా, రామ్‌చరణ్, నవీన్‌చంద్ర, మరికొందరు కీలకపాత్రధారులపై టాకీపార్టు చిత్రీకరణ కూడా జరగనుంది. కాగా ఈ సినిమా చిత్రీకరణను జూలైలోపు పూర్తి చేయాలని చిత్రయూనిట్‌ టార్గెట్‌ పెట్టుకుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. అంజలి, శ్రీకాంత్, జయరాం, సునీల్, ఎస్‌జే సూర్య కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న ‘గేమ్‌చేంజర్‌’  డిసెంబరులో విడుదల కానుందనే ప్రచారం ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో జరుగుతోంది.
 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement