రామ్‌చరణ్‌ ప్రెజెంట్స్‌.... 

Ram Charan flew to USA  - Sakshi

మంగళవారం రామ్‌చరణ్‌ అమెరికా వెళ్లారు. ఎందుకంటే... హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవంలో రామ్‌చరణ్‌ ఓ ప్రెజెంటర్‌గా ఉన్నారు. కాలిఫోర్నియాలో ని బెవర్లీ హిల్స్‌ వేదికగా ఈ నెల 24న సిక్త్‌ హెచ్‌సీఏ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. నిర్వాహకుల ఆహ్వానం మేరకు రామ్‌చరణ్‌ అక్కడకు ఓ ప్రెజెంటర్‌గా వెళ్లారు.

ఇక ఈ అవార్డుల జాబితాలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం..రణం..రుధిరం)కు నాలుగు (బెస్ట్‌ పిక్చర్, బెస్ట్‌ డైరెక్టర్, బెస్ట్‌ యాక్షన్‌ ఫిల్మ్, బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌) నామినేషన్స్‌ దక్కాయి. మరి.. అవార్డ్స్‌ వస్తాయా? అనేది చూడాలి. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top