ఆర్‌ఆర్‌ఆర్‌ : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట

Ram Charan And Jr NTR Jail Scenes In RRR Movie Will Give Goosebumps To Fans - Sakshi

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం రౌధ్రం రణం రుధిరం(ఆర్‌ఆర్‌ఆర్‌). శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ పాన్‌ఇండియా చిత్రానికి కరోనా సెకండ్‌ వేవ్‌ బ్రేకులు వేసింది. కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతుండటంతో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర షూటింగ్‌ని నిలివేశారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ ఆప్టేట్‌ ఆసక్తి రేకెత్తిస్తుంది. 

జైలులో జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల మధ్య వచ్చే ఓ సీన్‌ చాలా బాగుంటుందట. ఈ సీన్‌ ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేసేలా రాజమౌళి తెరకెక్కించారట. ఈ సన్నివేశం నేపథ్యంలో కాల భైరవ పాడిన బ్యాక్‌గ్రౌండ్‌ సాంగ్‌ అయితే ప్రేక్షకుడిని కంటతడి పెట్టిస్తుందట. ఈ పాట కోసం సంగీత దర్శకుడు ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాడట. నేపథ్య సంగీతం కూడా హృదయాలను హత్తుకునేలా తీర్చిదిద్దారట. ఇక ఈ సినిమాలో యాక్షన్‌ సన్నివేశాలకు సంబంధించి పలు వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్‌, పులికి మధ్య వచ్చే ఓ సీన్‌ అద్భుతంగా ఉంటుందట. రామ్‌ చరణ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ కూడా మరో లెవెల్లో ఉండబోతుందని సమాచారం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top