Rakul Preet Singh Have Back to Back 7 Release in 2022 - Sakshi
Sakshi News home page

Rakul Preet Singh: విభిన్న పాత్రల్లో కూల్‌ బ్యూటీ.. 2022లో 7 సినిమాలు

Jan 19 2022 8:04 PM | Updated on Jan 19 2022 8:44 PM

Rakul Preet Singh Have Back To Back 7 Releases In 2022 - Sakshi

సినిమాల్లో ఇప్పటివరకు హీరోలే విభిన్న పాత్రలు చేస్తూ అలరించారు. కానీ ఈసారి ఒక హీరోయిన్‌ వివిధ రకాల పాత్రలతో సందడి చేయనుంది. ఆమె ఫిట్‌నెస్‌ సుందరి రకుల్ ప్రీత్‌ సింగ్‌. టాలీవుడ్‌లో ప్రార్థనగా (వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌) పరిచయమైన రకుల్‌ ప్రీత్ సింగ్‌ అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు బీటౌన్‌లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. తాజాగా ఆమె నటించిన 7 సినిమాలు 2022లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో 6 చిత్రాలు బాలీవుడ్‌ మూవీస్‌  కావడం విశేషం. ఛత్రీవాలీ సినిమాలో రకుల్‌ కండోమ్‌ టెస్టర్‌గా కనిపించనున్నట్లు తెలిసిందే. 

(చదవండి: ప్రముఖ హీరోయిన్‌ ఇంట్లో చోరీ.. పోలీసులకు ఫిర్యాదు)

దీంతోపాటు బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న 'రన్‌ వే-34', అజయ్‌ దేవగణ్‌, సిద్ధార్థ్ మల్హోత్రాలతో 'థ్యాంక్‌ గాడ్‌', ఆయుష్మాన్ ఖురానా సరసన 'డాక్టర్‌ జీ', అటాక్‌తో పాటు మరొక చిత్రంలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తన సినిమాలు అందులో చేసే పాత్రల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది రకుల్‌. 'నా కెరీర్‌లో 2022 బాగుంటుందని ఆశిస్తున్నాను. నేను నటించిన 7 సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. వాటిలో 6 హిందీ చిత్రాలే. ఆ సినిమాలన్నింటిని ప్రేక్షకులు ఆదరించాలి. ఈ చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించాను. ప్రతీ చిత్రం కొత్త జోనర్‌లో తెరకెక్కింది. 'ఛత్రీవాలీ'లో కండోమ్‌ టెస్టర్‌ పాత్రను పోషించగా, 'రన్‌ వే-34'లో ఫైలెట్‌గా కనిపిస్తాను. అలాగే 'అటాక్‌' సైన్స్ ఫిక్షన్‌ చిత్రం కాగా, 'డాక్టర్‌ జీ'లో గైనకాలజిస్ట్‌ రోల్‌ చేస్తున్నాను. గత రెండేళ్లుగా ఈ సినిమాల షూటింగ్‌ జరిగింది. థియేటర్లలో ఈ సినిమాలు ఎప్పుడెప్పుడూ విడుదల అవుతాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.' అని కూల్‌ బ్యూటీ చెప్పుకొచ్చింది. 

(చదవండి: ప్రభాస్‌ తర్వాత స్థానంలో అ‍ల్లు అర్జున్‌.. దేనిలో అంటే ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement