సప్త సాగరాలు  | Sakshi
Sakshi News home page

సప్త సాగరాలు 

Published Sat, Sep 16 2023 5:38 AM

Rakshit Shetty blockbuster Sapta Sagaradaache Ello to release in Telugu - Sakshi

రక్షిత్‌ శెట్టి హీరోగా నటించి, నిర్మించిన కన్నడ చిత్రం ‘సప్త సాగర దాచే ఎల్లో’. హేమంత్‌ ఎం. రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా నటించారు. ఈ నెల 1న కన్నడలో విడుదలైన ఈ చిత్రం హిట్‌గా నిలిచింది.

ఈ సినిమాని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, రక్షిత్‌ శెట్టి కలిసి ‘సప్త సాగరాలు దాటి’ అనే పేరుతో ఈ నెల 22న తెలుగులో విడుదల చేయనున్నారు. ‘‘క్లాసిక్‌ లవ్‌ స్టోరీగా రూపొందిన చిత్రమిది. కన్నడలో సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ  చిత్రం తెలుగులోనూ సక్సెస్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్‌. ఈ చిత్రానికి సహనిర్మాత: వివేక్‌ కూచిభొట్ల. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement