ఆసుపత్రిలో చేరిన సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ | Rajinikanth Joins In Chennai Kauvery Hospital | Sakshi
Sakshi News home page

Rajinikanth Hospitalised: ఆసుపత్రిలో చేరిన సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌

Oct 28 2021 9:29 PM | Updated on Oct 28 2021 11:48 PM

Rajinikanth Joins In Chennai Kauvery Hospital - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అనారోగ్య కారణాలతో గురువారం సాయంత్రం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన ఆరోగ్యంపై మరింత సమాచారం రావాల్సి ఉంది. కాగా రజనీ ఇటీవల భారత ప్రభుత్వం నుంచి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.

ఇక తాజాగా ఆయన నటించిన ‘అన్నాత్తే’ చిత్రం తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదలకానుంది. దీపావళి కానుకగా నవంబరు 4న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా ‘రా సామీ’ అంటూ సాగే పవర్‌ఫుల్‌ సాంగ్‌ (లిరికల్‌ వీడియో)ను చిత్ర బృందం ఈ రోజే విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement