పావులూర్‌లో స్థలం కొనుగోలు చేసిన సూపర్‌ స్టార్‌ | Superstar Rajinikanth Bought A Place In Pavulur, Details Inside - Sakshi
Sakshi News home page

Superstar Rajinikanth: పావులూర్‌లో స్థలం కొనుగోలు చేసిన రజనీకాంత్‌

Published Fri, Mar 1 2024 6:37 AM

Rajinikanth Buying Land In Pavuluru - Sakshi

సౌత్‌ ఇండియన్‌ సూపర్‌ స్టార్‌గా కొనసాగుతున్న రజనీకాంత్‌ పావులూర్‌లో స్థలం కొనుగోలు చేశారు. సినీనటుడు రజనీకాంత్‌ కూడ బెట్టిన ఆస్తులు చాలానే ఉన్నాయి. ఒక్కో చిత్రానికి ఆయన రూ.100 కోట్లకు పైగా పారితోషికం పుచ్చుకుంటున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే స్థిర, చరస్తులు కలిగి ఉన్న రజనీకాంత్‌ తాజాగా చైన్నె నావలూర్‌ గ్రామం సమీపంలోని తాళంపూర్‌ రోడ్డులో ఒక గ్రానైట్‌ సంస్థకు చెందిన స్థలాన్ని కొనుగోలు చేశారు.

దాని రిజిస్ట్రేషన్‌ కోసం తాజాగా తిరుపోరూర్‌లోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆ స్థలాన్ని తన పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించారు. అనంతరం ఆయన బయటికి రావడంతో ఆ చుట్టు పక్కల ప్రజలు ఆయన్ని చుట్టుముట్టారు. రజినీకాంత్‌ ఓపిగ్గా ఫొటోలు దిగి, ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి వెళ్లారు. కాగా అక్కడ రజనీకాంత్‌కు భారీ పోలీస్‌ భద్రతను కల్పించారు.

Advertisement
 
Advertisement