రజనీకాంత్‌ 171వ చిత్ర టైటిల్‌ ఇదేనా? | Rajinikanth's 'Thalaivar 171' Movie Title Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌ 171వ చిత్ర టైటిల్‌ ఇదేనా?

Apr 2 2024 6:42 AM | Updated on Apr 2 2024 8:49 AM

Rajinikanth 171th Movie Title Viral In Social Media - Sakshi

నటుడు రజనీకాంత్‌ చిత్రం అంటేనే ప్రేక్షకుల్లో ఉండే క్రేజే వేరు. ఇటీవల జైలర్‌ వంటి అదిరిపోయే హిట్‌ చిత్రానిచ్చిన ఈయన ప్రస్తుతం జైభీమ్‌ చిత్రం ఫేమ్‌ జ్ఞానవేల్‌ దర్శకత్వంలో వేట్టైయాన్‌ చిత్రంలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఇందులో రజనీకాంత్‌ రిటైర్డ్‌ పోలీస్‌ అధికారిగా పవర్‌ఫుల్‌ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. కాగా తదుపరి ఈయన తన 171వ చిత్రానికి రెడీ అవుతున్నారు. దీనికి లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించనున్నారు.

ఈ చిత్రం గురించే పలు రకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. దానికి సూపర్‌ రెస్పాన్స్‌ వచ్చింది. రజనీకాంత్‌ గెటప్‌ చూస్తేనే ఇదేదో డాన్‌ కథా చిత్రంగా ఉంటుందనిపించేలా ఉంది. వైరెటీగా రజనీకాంత్‌ చేతులకు వాచీలతో కూడిన భేడీలు వేసిన ఫొటో ఉన్న పోస్టర్‌కు ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు. దీంతో ఇది టైమ్‌ ట్రావెల్‌ కథాంశంతో రూపొందనుందనే ప్రచారం జరిగింది. అయితే అలాంటి కథ కాదని దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ స్పష్టం చేశారు. అంతే కాకుండా ఇది మాదకద్రవ్యాలు, కిడ్నాప్‌కు సంబంధించిన కథ కూడా కాదని చెప్పారు.

దీంతో ఈ చిత్ర కథపై మరింత ఆసక్తి నెలకొంది. చిత్రం టైటిల్‌ను ఈ నెల 22వ తేదీన వెల్లడించనున్నట్లు, షూటింగ్‌ను జూన్‌లో ప్రారంభించనున్నట్లు దర్శకుడు ఇటీవల ఓ భేటీలో పేర్కొన్నారు. కాగా విక్రమ్‌ చిత్రంతో నటుడు కమలహాసన్‌కు సంచలన విజయాన్ని అందించిన లోకేశ్‌కనకరాజ్‌, ఇప్పుడు రజనీకాంత్‌ను చాలా డిఫరెంట్‌గా చూపించడానికి యత్నిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి 'కళుగు' అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇందులో రజనీకాంత్‌ విలన్‌గా నటించనున్నారనే ప్రచారం మరోపక్క సాగుతోంది.

కాగా 'కళుగు' అంటే ఆంగ్లంలో 'ఈగిల్‌' అని అర్థం. కాగా ఇదే టైటిల్‌తో రజనీకాంత్‌ 1981లో కథానాయకుడిగా నటించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందేనని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement