మహేష్‌ బాబు సినిమా ఈవెంట్‌.. వాళ్లకు నో ఎంట్రీ: రాజమౌళి | Rajamouli comments on SSMB29 globe trotter event | Sakshi
Sakshi News home page

మహేష్‌ బాబు సినిమా ఈవెంట్‌.. వాళ్లకు నో ఎంట్రీ: రాజమౌళి

Nov 13 2025 12:21 PM | Updated on Nov 13 2025 12:29 PM

Rajamouli comments on SSMB29 globe trotter event

మహేష్‌ బాబు , రాజమౌళి  సినిమా SSMB29 ఈవెంట్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఈ నెల 15న జరగనుంది. ఈ వేడుకలో భాగంగా మూవీ టైటిల్‌తో పాటు మహేష్‌ బాబు ఫ‌స్ట్ లుక్‌ను రివీల్‌ చేయనున్నారు. దీంతో భారీగా ఫ్యాన్స్‌ రానున్న నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి కొన్ని సూచనలు ఇస్తూ ఒక వీడియో విడుదల చేశారు.  ఈవెంట్‌ పాస్‌లు ఉన్నవాళ్లకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు.

'SSMB29 గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌ బాగా జరగాలంటే మీ సహకారం చాలా అవసరం. ఈవెంట్‌ పట్ల క్రేజ్‌ ఎక్కువ ఉండటంతో పోలీసు వారు ఎక్కువ ఆంక్షలు విధించారు. వాటిని తప్పకుండా మనం పాటించాలి. ఈ కార్యక్రమం బహిరంగంగా జరగడం లేదు. కాబట్టి పాస​్‌లు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుంది.  పాస్‌లు లేకున్నా సరే అనుమతి ఇస్తారని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. వాటిని నమ్మకండి. ఆన్‌లైన్‌లో కూడా మేము పాస్‌లు అమ్మడం లేదు. మాకు అనుమతి ఉన్నమేరకు మాత్రమే పాస్‌లు ఇస్తాం. అదే పాస్‌ మీద క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. ఎలా రావాలి అనేది అందులోనే క్లియర్‌గా చెప్పబడింది. దానిని మాత్రమే ఫాలో అవుతూ వేదిక వరకు చేరుకుండి. 

శనివారం మధ్యాహ్నం 2గంటల నుంచి అనుమతి ఉంటుంది. 18 సంవత్సరాల లోపు పిల్లలతో పాటు సీనియర్‌ సిటిజన్లుకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. కాబట్టి ఈ కార్యక్రమానికి వారెవరూ రావద్దని కోరుతున్నాను. ఇంటి వద్దే ఉండి జియోహాట్‌స్టార్‌లో లైవ్‌ ప్రసారంలో చూసేయండి. రీసెంట్‌గా జరిగిన పలు సంఘటనలను పోలీసులు దృష్టిలో పెట్టుకుని ఎక్కువ ఆంక్షలు విధించారు. కార్యక్రమంలో  ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే రద్దు చేస్తామని కూడా కమిషనర్‌ చెప్పారు. కాబట్టి వారి సూచనలను మనం తప్పకుండా పాటించాలి.' అని ఆయన అన్నారు. వేదిక వద్దకు ఎలా చేరుకోవాలి వంటి అంశాలను వీడియోలో తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement