'జీ 5'లో విడుదలైన 'రాజ రాజ చోర'కు హిట్ టాక్

Raja Raja Chora Ott Release In Zee5 For Dasara - Sakshi

భారీ సినిమాల విడుదలతో ప్రతివారం వీక్షకులకు వినోదం అందించడానికి సిద్ధమైన 'జీ 5'

దసరా కానుకగా 'జీ 5'లో 'రాజ రాజ చోర' విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులకు నచ్చడంతో దీనికి బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా చూసిన నెటిజన్లు సోషల్‌మీడియాలో హీరో శ్రీవిష్ణు, హీరోయిన్లు సునైనా, మేఘా ఆకాష్ నటనను ప్రశంసిస్తూ... అనేకమంది కామెంట్లు పోస్టులు పెడుతున్నారు. థియెట్రికల్ రిలీజ్ తర్వాత అపూర్వమైన మార్కెటింగ్ క్యాంపెయిన్ చూసిన సినిమా ఇదేనని చెప్పాలి. ఈ సందర్భంగా పబ్లిసిటీ మారథాన్‌లో పాల్గొన్న శ్రీ విష్ణు, దర్శకుడు హసిత్ గోలీకి 'జీ5' టీం కృతజ్ఞతలు తెలిపింది.

రచయిత - దర్శకుడు ప్రసన్న కుమార్ బెజవాడ సైతం సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. 'ఓ బేబీ' దర్శకురాలు నందిని రెడ్డి సినిమా గురించి సోషల్ మీడియాలో "మీరు వెండితెరపై అద్భుతమైన ఈ సినిమాను చూడడం మిస్ అయితే... ఇప్పుడు డిజిటల్  తెరపై చూసే అవకాశం మీకు దగ్గరకు వచ్చింది" అన్నారు. 'రాజ రాజ చోర' బ్లాక్ బస్టర్ సినిమా అని రచయిత - దర్శకుడు బివిఎస్ రవి పేర్కొన్నారు.

టీవీ, ప్రింట్ ప్రమోషన్‌ల నుంచి డిజిటల్ మీడియా వరకు... ఇన్‌ఫ్లుయెన్సర్‌ల నుండి మీమ్ పేజీల వరకూ... సినిమాలో ఫన్నీ మూమెంట్స్ షేర్ చేయడం చూస్తుంటే 'రాజ రాజ చోర' ప్రజలు మెచ్చిన ఎంటర్టైనర్ అని స్పష్టమవుతుంది. 'జీ 5'లో తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు అద్భుత స్పందన అందుకున్న ఈ సినిమాను దసరా వీకెండ్ లో మరింత మంది చూసే అవకాశం ఉంది.

అక్టోబర్ 22న 'జీ 5'లో 'హెడ్స్ & టేల్స్' విడుదల కానుంది. దీంతో మరింత ఎంటర్టైన్మెంట్ వీక్షకులకు అందించడానికి సిద్ధమవుతోంది. విమర్శకుల ప్రశంసలు పొందిన 'కలర్ ఫోటో' సినిమా టీమ్ నుంచి వస్తున్న సినిమా ఇది. ముగ్గురు మహిళలు, భగవంతుడు చుట్టూ తిరిగే అందమైన కథతో 'హెడ్స్ అండ్ టేల్స్' రూపొందింది. ఇందులో భగవంతుడిగా సునీల్ నటించగా... 140కి పైగా చిత్రాలకు సంగీతం అందించిన మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించారు. ప్రస్తుతం తెలుగు ప్రజలు కంటెంట్ బేస్డ్ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. 

చదవండి: MAA: బాలయ్యను కలిశాను, త్వరలో చిరంజీవిని కలుస్తా: మంచు విష్ణు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top