అందుకే నా ట్రస్ట్‌కి విరాళాలు వద్దని చెప్పా: లారెన్స్‌ | Raghava Lawrence Reveals The Reasons Behind Why He Said To Fans To Not Send Donations, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Raghava Lawrence Video: పొగరుతో డబ్బులు వద్దనలేదు, కారణం ఏంటంటే..

Aug 30 2023 5:26 PM | Updated on Aug 30 2023 5:54 PM

Raghava Lawrence Release Requests Fans To not Send Donations, Reveals The Reason, Video Goes Viral - Sakshi

సామాజిక సేవ కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటాడు రాఘవా లారెన్స్‌. ‘రాఘవా లారెన్స్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌’ ద్వారా ఇప్పటికే ఎంతోమంది చిన్నారులకు, దివ్యాంగులకు సేవలు అందిస్తున్నారు. డ్యాన్సర్‌గా ఉన్నప్పుడు దివ్యాంగులకు డ్యాన్స్‌ నేర్పించాడు. కొంతమంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్‌ చేయించడ,  కరోనా సమయంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేయటం.. ఇలా క్రమంగా ఆయన తన సేవా కార్యక్రమాలను పెంచుకుంటూ వెళుతున్నారు.

అయితే లారెన్స్‌ చేసే మంచి పనులు చూసి కొంతమంది అతని ట్రస్ట్‌కు డబ్బులు పంపిస్తున్నారు. కానీ ఇది లారెన్స్‌కి నచ్చడం లేదు. తన ట్రస్ట్‌కు ఎవరూ డబ్బులు పంపొద్దని, తానే చూసుకుంటానని ట్వీట్‌ చేశాడు. లారెన్స్‌ నిర్ణయాన్ని పలువురు నెటిజన్స్‌ తప్పుబట్టారు. అతన్ని ట్రోల్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలో లారెన్స్‌ తాజాగా ఓ వీడియోని విడుదల చేశాడు. తాను విరాళాలు స్వీకరించకపోవడానికి గల కారణాలు తెలియజేశాడు. 

(చదవండి: అల్లు అర్జున్‌కి గ్లోబల్ వైడ్ క్రేజ్.. ఎలా సాధ్యమైంది?)

"నా ట్రస్ట్ కి ఎవరూ డబ్బులు పంపొద్దు..నా పిల్లల్ని నేనే చూసుకుంటాను.. అని కొన్ని రోజుల ముందు రిక్వెస్ట్ చేస్తూ నేను ఒక ట్వీట్ వేశాను. అందుకు కారణమేంటంటే నేను డాన్స్ మాస్టర్ గా ఉన్నప్పుడు ఓ ట్రస్ట్ ను స్టార్ట్ చేశాను. అందులో 60 మంది పిల్లల్ని పెంచటం, వికలాంగులకు డాన్స్ నేర్పించటం, ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించటం వంటి కార్యక్రమాలను నిర్వహించాను. 

 ఈ పనులన్నింటినీ నేను ఒకడ్నినే చేయలేకపోయాను. అందుకనే ఇతరుల నుంచి సాయం కావాలని కోరాను. అప్పుడు రెండేళ్లకు ఓసినిమానే చేసేవాడిని. కానీ ఇప్పుడు సంవత్సరానికి మూడు సినిమాలు చేస్తున్నాను. బాగానే డబ్బులు వస్తున్నాయి కదా, నాకు నేనే చేయొచ్చు కదా, ఇతరులను ఎందుకు అడిగి చేయాలని నాకే అనిపించింది. 

నేను పొగరుతో ఇతరులు సేవ కోసం ఇచ్చే డబ్బులను వద్దనటం లేదు. నాకు ఇచ్చే డబ్బులను మీకు దగ్గరలో డబ్బుల్లేక కష్టపడే ట్రస్టులు చాలానే ఉన్నాయి. అలాంటి వారికి సాయం చేయండి. వారికెంతో ఉపయోగపడుతుంది. వారికి చాలా మంది సాయం చేయరు. నేను ఎంత చెప్పినా కొందరైతే నాతో కలిసే సాయం చేస్తామని అంటున్నారు. చాలా సంతోషం. ఆర్థిక ఇబ్బందులో బాధపడేవారెవరో నేనే చెబుతాను. మీచేత్తో మీరే సాయం చేయండి. అది మీకు ఎంతో సాయాన్ని కలిగిస్తుంది. థాంక్యూ సో మచ్ ’అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement