Prabhas Radhe Shyam: Movie Makers Install Free Astrology Centers In Theaters Deets Here - Sakshi
Sakshi News home page

Radhe Shyam: వావ్‌.. వాట్‌ యాన్‌ ఐడియా,  థియేటర్స్‌లో ఆస్ట్రాలజీ కౌంటర్

Feb 27 2022 1:16 PM | Updated on Feb 27 2022 1:50 PM

Radhe Shyam Makers Install Free Astrology Centers In Theaters - Sakshi

Prabhas-Pooja Hegde Radhe Shyam Movie Promotions: పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటించిన పీరియాడికల్‌ ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్‌’ కోసం అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్ర యూనిట్‌. జోతిష్యం, హ‌స్త‌సాముద్రికం త‌దిత‌ర అంశాల‌కు సంబంధించి చాలా హ‌నెస్ట్‌గా ఓ విష‌యాన్ని చెప్పామని.. అదే ఈ చిత్రానికి మెయిన్ కంక్లూజ‌న్ అంటున్నారు మేకర్స్.

రాజులు, యువ‌రాజులు, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిష్ట‌ర్ వంటి పెద్ద పెద్ద వారికి పల్మ‌నాల‌జీ చెప్పే ప‌ల్మనిస్ట్ క్యారెక్టర్‌లో ప్ర‌భాస్ న‌టించారు. ప్ర‌పంచ‌లోనే తొలిసారిగా ఈ నేప‌థ్యంలో వ‌స్తున్న చిత్రం రాధే శ్యామ్. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌ని చాలా కొత్తగా చేయాలని డిసైడ్‌ అయింది చిత్ర యూనిట్‌. జోతిష్యం నేపథ్యంలో వస్తున్న చిత్రం కావడంతో.. దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్స్‌లో ఆస్ట్రాలజీ కౌంటర్ ఓపెన్ చేశారు. 

అక్కడ జ్యోతిష్యం చెప్తూ సినిమాకు ప్రమోషన్ చేస్తున్నారు. ఈ వినూత్నమైన ఐడియాకు ప్రేక్షకుల నుంచి కూడా అనూహ్యమైన స్పందన వస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌తో పాటు పాటలకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణంరాజు ఈ సినిమాను సమర్పిస్తుండగా.. వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. రాధా కృష్ణ కుమార్ రాధే శ్యామ్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో రెబల్ స్టార్ ప్రభాస్ కి జోడీగా నటిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement