
సినీ నటుడు రాజీవ్ కనకాలకు హైదరాబాద్లోని రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ పసుమాములలో తనకు సంబంధించిన వివాదస్పద ప్లాటును సినీ ఇండస్ట్రీకి చెందిన విజయ్ చౌదరికి గతంలో విక్రయించారు. అదే ప్లాటును విజయ్ చౌదరి మరో వ్యక్తికి రూ. 70 లక్షలకు విక్రయించాడు. అయితే, లేని ప్లాటును ఉన్నట్లు చూపి తమను మోసం చేశారని బాధితుల ఆరోపించారు. దీంతో విజయ్ చౌదరిపై హయత్నగర్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఇదే కేసులో విచారణకు రావాలని రాజీవ్ కనకాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.