Actress Raashi Khanna About Her Baahubali Offer - Sakshi
Sakshi News home page

Raashi Khanna: బాహుబలిలో అవంతిక పాత్ర కోసం పిలిచారు, కానీ రాజమౌళి మాత్రం..

Mar 8 2023 11:50 AM | Updated on Mar 8 2023 12:16 PM

Raashi Khanna About Her Bahubali Offer - Sakshi

అవంతిక పాత్ర కోసం ఆడిషన్‌ జరిగింది. నాకు పిలుపొచ్చింది, వెళ్లాను. కానీ రాజమౌళి సర్‌ నన్ను చూసి చాలా క్యూట్‌గా ఉందీ అమ్మాయి, ఏదై

చూడగానే బబ్లీగా కనిపించే రాశీఖన్నా ఎక్కువగా జాలీగా ఉండే పాత్రల్లోనే మెరిసింది. తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకున్న ఆమె యోధతో బాలీవుడ్‌లోనూ పాగా వేసేందుకు రెడీ అయింది. నిజానికి మద్రాస్‌ కేఫ్‌ అనే హిందీ సినిమాతోనే ఆమె వెండితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత వరుసగా తెలుగు సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో సెటిలైపోయింది. మధ్యమధ్యలో మలయాళ, తమిళ చిత్రాలు కూడా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది.

'నేను నటించిన మద్రాస్‌ కెఫె సినిమా అయిపోయాక రాజమౌళి సర్‌ బాహుబలి సినిమా కోసం ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నారు. తమన్నా నటించిన అవంతిక పాత్ర కోసం ఆడిషన్‌ జరిగింది. నాకు పిలుపొచ్చింది, వెళ్లాను. కానీ రాజమౌళి సర్‌ నన్ను చూసి చాలా క్యూట్‌గా ఉందీ అమ్మాయి, ఏదైనా లవ్‌ స్టోరీకి బాగా సెట్టవుతుంది అన్నాడు. నా స్నేహితుడొకరు మంచి ప్రేమకథపై వర్క్‌ చేస్తున్నాడు. ఓసారి ఆ కథ విను, నీకు తప్పకుండా నచ్చుతుంది అన్నారు. అలా ఊహలు గుసగుసలాడేతో నేను తెలుగులో లాంచ్‌ అయ్యాను. కానీ రాజమౌళి సినిమాలో చిన్న పాత్రైనా చేయాలనుంది' అని చెప్పుకొచ్చింది రాశీ ఖన్నా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement