నేను కోట్ల కొద్దీ డబ్బులు గుమ్మరించింది దానికే!: హీరో | Sakshi
Sakshi News home page

R Madhavan: లైసెన్స్‌ పొందా.. దుబాయ్‌లోనే ఉంచా.. అందులో తిరుగుతుంటే మజా..

Published Mon, Mar 18 2024 2:04 PM

R Madhavan Says His Priciest Purchase is Yacht - Sakshi

హీరో ఆర్‌ మాధవన్‌ ఎక్కువ డబ్బు పెట్టి కొన్నదేంటో తెలుసా? యాచ్‌.. అదేంటనుకుంటున్నారా? ఇదొక భారీ పడవలాంటిది. ఇందులోపల ఇంటి మాదిరిగా అన్నిరకాల వసుతులు కూడా ఉంటాయి. దీని గురించి మాధవన్‌ మాట్లాడుతూ.. నేను చాలా డబ్బులు ఖర్చు చేసింది నా ఇంటి కోసమే! చాలా ఖరీదైన ఇంటిని నేను కొనుగోలు చేశాను. నిజానికి ముగ్గురే ఉండే ఇంటికి అంత పెద్ద ఇల్లు అవసరమే లేదనుకోండి. ఇల్లును పక్కన పెడితే అదే రేంజ్‌లో ఖర్చు చేసి కొన్నదేదైనా ఉందా? అంటే అది యాచ్‌(పెద్ద పడవలాంటిది).

లైసెన్స్‌ దొరికింది
ఓడ కొనాలంటే కెప్టెన్‌ లైసెన్స్‌ కావాలి. ఆ లైసెన్స్‌ సంపాదించాలని ఎప్పటినుంచో అనుకున్నాను. కరోనా సమయంలో చేయడానికి పనేం లేదు కాబట్టి పరీక్ష రాశాను. పాసయ్యాను, లైసెన్స్‌ పొందాను. ఇందుకు ఆరునెలలు పట్టింది. ఇప్పుడు నేను 40 అడుగుల ఎత్తైన యాచ్‌ లేదా పడవను నేను ఈజీగా డీల్‌ చేయగలను. దానికోసమే యాచ్‌ను కొన్నాను.. అందులో ప్రయాణిస్తుంటే భలే మజా వస్తుంది. నేను అందులో కూర్చుని కథలు రాసుకుంటాను.

బోలెడన్ని కథలు రాస్తూ..
అవసరమైనప్పుడు బయటకు వెళ్లి సముద్రాన్ని చూస్తాను. నాకు కావాలనుకున్నప్పుడు ఎక్కడో ఓ చోట పార్క్‌ చేసి డాల్ఫిన్స్‌ ఎగురుతూ ఉంటే చూసి ఆనందిస్తాను. అలా సముద్రాన్ని చూసి బోలెడన్ని కథలు రాసుకుంటాను. నా జీవితంలో ఈ పడవ కొనడమే నేను తీసుకున్న గొప్ప నిర్ణయం. ప్రస్తుతం దాన్ని దుబాయ్‌లో ఉంచాను అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే 30 -40 అడుగుల ఎత్తైన యాచ్‌ కొనాలంటే దాదాపు ఐదు లక్షల డాలర్స్‌ నుంచి రెండు మిలియన్ల డాలర్స్‌ (భారత కరెన్సీలో నాలుగున్నర కోట్ల నుంచి పదహారు కోట్ల మేర) అవుతుందని తెలుస్తోంది! 

చదవండి: 56 ఏళ్ల వయసులో నటుడి డేటింగ్‌.. విడిపోయామంటూ పోస్ట్‌..

Advertisement
 

తప్పక చదవండి

Advertisement