Allu Arjun Pushpa Movie Hindi Version Collections Creates Record With 100 Crores - Sakshi
Sakshi News home page

Pushpa Movie : పుష్ప ఖాతాలో మరో రికార్డ్​.. అక్కడ రూ. 100 కోట్ల కలెక్షన్లు

Feb 1 2022 10:03 AM | Updated on Feb 1 2022 11:32 AM

Pushpa Movie Hindi Version Earns 100 Crores In India - Sakshi

Pushpa Movie Hindi Version Earns 100 Crores In India: ఐకానిక్​ స్టార్​ అల్లు అర్జున్, క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్​ చిత్రం 'పుష్ప: ది రైజ్'​. గతేడాది డిసెంబర్​ 17న విడుదలైన ఈ చిత్రం భారీ హిట్​ కొట్టింది. కరోనా సమయంలోనూ అత్యధిక కలెక్షన్లతో దూసుకపోయింది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 300 కోట్లు రాబట్టిందని చిత్ర యూనిట్ ప్రకటించింది. 2021లో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలవడం మాత్రమే కాదు బన్ని కెరీర్ లో తొలిసారి రూ. 300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మూవీగా రికార్డుల్లోకి ఎక్కింది పుష్ప. 



అయితే తాజాగా పుష్ప మరో రికార్డును సొంతం చేసుకుంది. హిందీలో ఈ మూవీ రూ. 100 కోట్లు కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది. సినిమాకు ముందు నుంచే భారీ హైప్ రావడం అందుకు తగినట్లు సుకుమార్ టేకింగ్​, బన్నీ, రష్మిక మందన్నా, సమంత స్పెషల్​ సాంగ్​ ప్రతీ ఒక్కరూ మూవీ విజయం సాధించేలా చేశాయి. అలాగే పుష్ప సాంగ్స్​, డైలాగ్స్​, మ్యానరిజంపై వచ్చిన రీల్స్​ సోషల్​ మీడియాలో వైరల్​ కావడంతో సినిమా మరింత పాపులర్​ అయింది. 



ఓటీటీలో విడుదలైన తర్వాత కూడా థియేటర్లలో మంచి స్పందన రావడం ఈ చిత్రానికే చూశానని ప్రముఖ బాలీవుడ్​ క్రిటిక్​ తరుణ్​ ఆదర్శ్​ ఇటీవల ట్వీట్​ చేశారంటే పుష్ప ఎంతలా ఆకట్టుకుంటుందో అర్థమవుతుంది. మొన్నటి వరకూ తెలుగు, మలయాళంలో అభిమానులు ఉన్న బన్నీకి పుష్పతో నార్త్​లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్​ సంపాదించుకున్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement