అమెరికాలో పుష్ప క్రేజ్.. అనసూయతో తగ్గేదేలే అంటున్న న్యూయార్క్ మేయర్‌ | Pushpa Dialogue Performs New York City Mayor As Same as Allu Arjun | Sakshi
Sakshi News home page

Pushpa Dialogue: పుష్ప డైలాగ్‌ క్రేజ్.. తగ్గేదేలే అంటున్న న్యూయార్క్ మేయర్

Oct 11 2022 9:28 PM | Updated on Oct 11 2022 9:40 PM

Pushpa Dialogue Performs New York City Mayor As Same as Allu Arjun - Sakshi

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ పుష్పకు క్రేజ్ ఏ మాత్రం తగ్గట్లేదు. పాన్‌ ఇండియాలో ప్రభంజనం సృష్టించిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆ సినిమాలోని పాటలకు విదేశీయులు సైతం స్టెప్పులేశారు. ఈ చిత్రంలోని బన్నీ డైలాగ్‌ తగ్గేదేలే అంటూ చేసే యాక్షన్‌కు మామూలు ఫాలోయింగ్ కాదు.  తాజాగా అల్లు అర్జున్ యాక్షన్‌కు అమెరికాలోని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ సైతం ఫిదా అయిపోయారు. తగ్గేదేలే అంటూ బన్నీ స్టైల్లో యాక్షన్ చేసి చూపించారు. టాలీవుడ్ యాంకర్ అనసూయ పక్కనే ఉండగా మేయర్ అల్లు అర్జున్‌ యాక్షన్‌లో అదరగొట్టారు. 

(చదవండి: క్రేజీ అప్‌డేట్‌.. ఆ రోజు నుంచే ‘పుష్ప-2’ రెగ్యులర్‌ షూటింగ్‌!)

న్యూయార్క్‌లో దసరా సందర్భంగా తెలుగు సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి యాంకర్ అనసూయ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మేయర్ అక్కడే ఉన్న ప్రజలతో మమేకమై వారితో కలిసి బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో న్యూయార్క్ మేయర్‌ ఆఫీస్ ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ వీడియోపై పుష్ప టీం స్పందిస్తూ ' భారతీయ చిత్రంపై మీ ప్రేమను చూపినందుకు ధన్యవాదాలు. ఈవెంట్‌ను గ్రాండ్‌ సక్సెస్ చేసినందుకు అనసూయ, మంగ్లీకి ప్రత్యేక కృతజ్ఞతలు' అంటూ ట్వీట్ చేసింది. ఇటీవలే ఈ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న పుష్ప-2 మూవీ కూడా షూటింగ్ ప్రారంభమైంది. 

అల్లు అ‍ర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప' సినిమా అవార్డుల్లోనూ తగ్గేదేలె అంటోంది. పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్న ఈ సినిమా ఎన్నో రికార్డులను తిరగరాసింది. తాజాగా ప్రతిష్టాత్మక 67వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోనూ పుష్ప క్లీన్‌ స్వీప్‌ చేసేసింది. ఏకంగా 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సొంతం చేసుకుని సత్తాచాటింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement