
నేషనల్ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ భామ రష్మిక మందన్నా. ప్రస్తుతం పుష్ప-2 చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్పకు సీక్వెల్‌గా అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రంలో శ్రీవల్లి మరోసారి అలరించనుంది. పుష్ప-2 కోసం అటు బన్నీ ఫ్యాన్స్.. ఇటు రష్మిక ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా గతేడాది రణ్‌బీర్ కపూర్‌తో కలిసి యానిమల్‌లో నటించిన రష్మిక బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది ముద్దుగుమ్మ. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రంలోని ఓ వీడియో క్లిప్‌ను నెటిజన్ షేర్ చేస్తూ కామెంట్ చేశారు. ఒక పురుషుడిని నమ్మడం అనే దానికంటే భయంకరమైంది ఇంకోటి లేదు అంటూ యానిమల్‌లోని రష్మిక, రణ్‌బీర్ కపూర్, త్రిప్తి ఉన్న వీడియోను పంచుకుంది.
ఇది చూసిన రష్మిక సైతం నెటిజన్‌కు రిప్లై ఇచ్చింది. మీరు చేసిన దాంట్లో ఓ చిన్న కరెక్షన్ ఉందంటూ పోస్ట్ చేసింది. ఓ పిచ్చివ్యక్తిని మీరు నమ్మడమనేది భయం.. అలాగే ఇక్కడ చాలా మంది మంచి పురుషులు కూడా ఉన్నారు. అలాంటి వారిని నమ్మితే అదోక స్పెషల్ అంటూ రష్మిక రాసుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Correction : trusting a stupid man = scary.. there are a lot of good men also out there.. trusting those men = special. 🫶🏻
— Rashmika Mandanna (@iamRashmika) June 13, 2024