హైదరాబాద్‌లోనే 'పుష్ప 2' ఈవెంట్.. కానీ ప్లాన్ ఛేంజ్! | Pushpa 2 Pre Release Event Hyderabad Details Latest | Sakshi
Sakshi News home page

Pushpa 2: అనుమతి దొరికింది.. హైదరాబాద్ ఈవెంట్ ఎప్పుడు ఎక్కడ?

Nov 29 2024 1:25 PM | Updated on Nov 29 2024 3:00 PM

Pushpa 2 Pre Release Event Hyderabad Details Latest

పాట్నా, చెన్నై, కొచ్చి, ముంబయి.. ఇలా పాన్ ఇండియా సినిమాకు తగ్గట్లే దేశమంతా 'పుష్ప 2' టీమ్ తెగ తిరిగేస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్ ఎక్కడ నిర్వహిస్తారా అనేది కాస్త సందేహంగా అనిపించింది. అయితే ఇప్పుడు వాటికి ఎండ్ కార్డ్ పడిందని తెలుస్తోంది. హైదరాబాద్‌లోనే ఈవెంట్ నిర్వహిస్తున్నప్పటికీ ప్లాన్‌లో చిన్న మార్పు జరిగినట్లు సమాచారం.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 28 సినిమాలు)

డిసెంబరు 5న థియేటర్లలో రిలీజయ్యే 'పుష్ప 2'కి కావాల్సినంత బజ్ ఏర్పడింది. అయినా సరే టీమ్‌తో కలిసి దేశమంతా చుట్టేస్తున్న అల్లు అర్జున్.. హైప్‌ని ఇంకా పెంచేస్తున్నాడు. గతంలో 'దేవర' విషయంలో గందరగోళం జరిగిన దృష్ట్యా.. 'పుష్ప 2' హైదరాబాద్ ఈవెంట్‌కి అనుమతిస్తారా అనేది డౌట్‌గానే ఉండేది. యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఉండొచ్చు అన్నారు. కానీ ఇది ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీ గ్రౌండ్‌కి మారిందట.

టీమ్ అధికారికంగా ప్రకటించినప్పటికీ.. ఇదే వేదిక ఫైనల్ అయిందని తెలుస్తోంది. ఇప్పటికే సెన్సార్ కూడా అయిపోయింది కాబట్టి డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ వేడుకలో పాల్గొంటారని సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో? 

(ఇదీ చదవండి: చైతూ-శోభిత పెళ్లి సందడి.. హల్దీ ఫొటోలు వైరల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement