ప్రముఖ కొరియోగ్రాఫర్‌ నిశ్చితార్థం | Punit Pathak Gets Engaged To Nidhi Moony Singh | Sakshi
Sakshi News home page

నిశ్చితార్థం చేసుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్‌

Aug 27 2020 9:26 AM | Updated on Aug 27 2020 10:57 AM

Punit Pathak Gets Engaged To Nidhi Moony Singh - Sakshi

ముంబై : ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు పునీత్ పాథక్ తన చిరకాల ప్రేయసి నిధి నిధి మూనీసింగ్‌ను నిశ్చితార్థం చేసుకున్నారు. బుధవారం రాత్రి ఇరువురు నిశ్చితార్థపు ఉంగరాలను మార్చుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను పునీత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. వీటికి ‘జీవితానికి ఆరంభం’ అంటూ క్యాప్షన్‌ జోడించారు. ఇక ఈ నూతన జంటకు పలువురు అభినందనలు తెలిపారు. బాలీవుడ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ పునీత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వరణ్‌, పునీత్‌ కలిసి ఎబీసీడీ2, స్ట్రీట్‌ డ్యాన్సర్‌ 3డీ వంటి సినిమాల్లో కలిసి పనిచేశారు. (టీమిండియా క్రికెటర్‌ నిశ్చితార్థం..)

కొరియోగ్రాఫర్‌ టెరెన్స్‌ టూయిస్‌, సింగర్‌ ఆదిత్య నారాయణ్‌, మౌని రాయ్‌, ఇషా గుప్తా, గౌహర్‌ ఖాన్‌, మో డిసౌజాతో పాటు ఇతరులు సోషల్‌ మీడియా వేదికగా పునీత్‌ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా రియాలిటీ షో డాన్స్‌ ఇండియా డాన్స్‌తో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఈ షోలో రన్నరప్‌గా నిలిచారు.  తర్వాత హలా లక్ దిఖా జా, దిల్ హై హిందుస్తానీ, డాన్సు  ప్లస్, ఇండియా బనేగా మంచ్, డాన్స్‌ ఛాంపియన్స్‌ వంటి రియాలిటీ షోలలో పాల్గొన్నాడు. 2013లో రెమో డిసౌజా దర్శకత్వం వహించిన ఏబీసీడీ సినిమా ద్వారా పునీత్‌ బాలీవుడ్‌లో అడుగు పెట్టారు. ('ఫిదా' న‌టుడి నిశ్చితార్థం)

Advertisement
 
Advertisement
Advertisement