Chor Bazaar Movie: ఆ విషయం ఆసక్తిగా ఉంటుంది: నిర్మాత

Producer VS Raju About Akash Puri Chor Bazaar Movie - Sakshi

Producer VS Raju About Akash Puri Chor Bazaar Movie: ‘‘హైదరాబాద్‌లో దాదాపు 400 సంవత్సరాలుగా ‘చోర్‌ బజార్‌’ ఉంది. నిజాం కాలంలో దొంగతనం చేసిన వస్తువులను అక్కడ అమ్మేవారని చెబుతారు. ఇప్పటికీ చోరీ చేసిన వస్తువులను అక్కడ విక్రయిస్తారని అంటుంటారు. ‘చోర్‌ బజార్‌’ సినిమాతో ఆకాష్‌కు మంచి పేరు వస్తుంది’’ అని నిర్మాత వీఎస్‌ రాజు అన్నారు. ఆకాష్‌ పూరి, గెహనా సిప్పీ జంటగా జీవన్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చోర్‌ బజార్‌’. ఈ నెల 24న ఈ సినిమా విడుదల కానుంది. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వీఎస్‌ రాజు మాట్లాడుతూ – ‘‘నాది భీమవరం. సినిమాలపై ఆసక్తితో రామ్‌గోపాల్‌ వర్మ ‘రక్ష’ చిత్రానికి దర్శకత్వ విభాగంలో పని చేశాను. ‘గుండెల్లో గోదారి, జోరు...’ఇలా ఏడెనిమిది చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాను. ‘రక్ష’ సమయంలోనే జీవన్‌ రెడ్డితో నాకు పరిచయం ఏర్పడింది. నేను దర్శకత్వ విభాగంలో పనిచేసినా ఈ సినిమా విషయంలో ప్రొడక్షన్‌ మాత్రమే చూసుకున్నాను. రాత్రి జరిగే కథ ఇది.  హీరోయిన్‌ పాత్రను మూగగా ఎందుకు చూపించాం? అనేది ఆసక్తిగా ఉంటుంది. పృథ్వీ ఫైట్స్‌ బాగా డిజైన్‌ చేశాడు. సురేష్‌ బొబ్బిలి సంగీతం అదనపు ఆకర్షణ. మా జర్నీలో యూవీ క్రియేషన్స్‌ సంస్థ కలవడం మాకు మరింత ధైర్యాన్నిచ్చింది’’ అని తెలిపారు.

చదవండి: మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్‌ హీరో నరేష్‌ !
సినిమా సెట్‌లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top